Court to frame additional charges in babri masjid case రారండోయ్ నా ముందుకు.. బీజేపీ అగ్రనేతలకు సీబిఐ కోర్టు పిలుపు

Cbi court asks advani uma bharti to appear before it on friday

babri Masjid Case, Babri Masjid demolition, BJP, cbi, CBI court, LK Advnai, rss, Uma Bharti, Vinay Katiyar, Babri Masjid, Manohar Joshi, news, national news, india news

A special CBI court has ordered several BJP leaders, including L K Advani, to appear before it on Friday in the Babri Masjid demolition case.

రారండోయ్ నా ముందుకు.. బీజేపీ అగ్రనేతలకు సీబిఐ కోర్టు పిలుపు

Posted: 05/25/2017 11:41 AM IST
Cbi court asks advani uma bharti to appear before it on friday

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రోజువారి విచారణ జరిపి రెండేళ్లలో విచారణను ముదించి తుది తీర్పును వెలువరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబిఐని అదేశించిన నేపథ్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో ఈ కేసులో నిందితులపై అదనపు అభియోగాలను నమోదు చేయనుంది సీబిఐ. ఈ కేసులో ప్రధాన నిందితులుగా వున్న బీజేపి అగ్రనేతలతో పాటు అర్ఎస్ఎస్ నాయకులు మొత్తం 12 మందిపై అదనపు అభఇయోగాలను దాఖలు చేయనుంది. ఈ మేరకు సిబిఐ సుప్రీంకోర్టును గతంలోనే చెప్పింది.

బాబ్రీ మసీదు కూల్చివేతలో కుట్ర కోణం వుందన్న అరోపణలు విచారిస్తున్న సిబిఐ.. ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్ సహా సాధ్వీ రితాంభరి, విష్ణు హరి దాల్మియాలపై అభియోగాలను ఈ నెల 26న ధాఖలు చేయనున్నారు. కాగా, మహంత్ న్రిత్య గోపాల్ దాస్, మహంత్ రామ్ విలాస్ వేదాంతి, బైకుంత్ లాల్ శర్మ అలియస్ ప్రేమ్ జీ, చంపత్ రాయ్ బన్సాల్, ధర్మ దాస్, డాక్టర్ సతీష్ ప్రధాన్ లపై అదనపు అభియోగాలను శుక్రవారం దాఖలు చేయనున్నారు.

అయితే బాబ్రీ కూల్చివేత అంశంలో వీరిపై ఉన్న నేరపూరిత కుట్ర ఆరోపణలను 2011లో అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేయగా, గత నెలలో సుప్రీంకోర్టు పునరుద్ధరించిన విషయం తెలిసిందే. కాగా, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 120-బి ప్రకారం అద్వానీ తదితరులపై కొత్తగా అభియోగాలు మోపొచ్చని సుప్రీంకోర్టు తెలపడంతో ఈ కేసులో నిందితులపై మరిన్నీ అదనపు అభియోగాలను నమోదు చేసే అవకాశమున్నట్లు సమాచారం. అభియోగాలను నమోదు చేయనున్న క్రమంలో నిందితులందరినీ కోర్టు తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. దీంతో బీజేపి అగ్రనేతలు రేపు సీబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకావాల్సివుంది. అయితే వ్యక్తిగత హజరునుంచి తమకు మినహాయింపు కల్పించాలని ఇప్పటికే బీజేపి నేతలు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles