warangal urban collector 'lies' erupts controversy అమ్రపాలి ‘అబద్దాలు’ వివాదాస్పదం

Warangal urban collector lies erupts controversy

warangal urban collector amrapali, warangal urban collector amrapali lies erupts controversy, amrapali controversy statements, warangal urban collector, aprapali, lies, job interviews, job aspirants, telanagana

warangal urban collector amrapali suggests to tell lies during job interviews but make them true in service, which erupts controversy.

ITEMVIDEOS: అమ్రపాలి ‘అబద్దాలు’.. తప్పు తప్పేనన్న అమాత్యులు

Posted: 05/25/2017 11:08 AM IST
Warangal urban collector lies erupts controversy

తెలంగాణ రాష్ట్రంలో మరో హైదరాబాద్ నగరంలా దూసుకుపోతున్న నగరం వరంగల్. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ స్థానిక యువతకు జాబ్‌ మేళా నిర్వహించింది. అర్హత కలిగన అశావహులను ఉద్దేశించిం ప్రసంగిస్తూ అమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉద్యోగాల కోసం వచ్చిన వందలాది మంది అశావహుల సమక్షంలో అమె వారికి చేసిన సూచన కాస్తా రాజుకుంది. అయితే వేదిక మీద వున్న అమాత్యులు మాత్రం అమె వ్యాఖ్యలను ఖండించారు. అమె చేసిన సూచనను అశావహులు పాటించరాదని, నిజాయితీతో ఉన్నది వున్నట్లు చెప్పి ఉద్యోగాలను సంపాదించాలని మంత్రులు కోరారు.

వివరాల్లోకి వెళ్తే.. నిరుద్యోగుల కోసం ములుగు వద్ద తెలంగాణ ప్రభుత్వం అదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ అమ్రపాలి.. ఉద్యోగం రావాలంటే అశావహులు కొన్ని అబద్దాలు ఆడాల్సివుంటుందని అన్నారు. అయితే అవి మీకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన యాజమాన్యాలకు తెలియకుండా నిజం చేసేందుకు సర్వీసులోకి వచ్చిన తరువాత వాటిని నిజం చేయాలని సూచించారు.

అమ్రపాలి వ్యాఖ్యలతో జాబ్‌ మేళాకు హాజరైన మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలు కంగుతిన్నారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వూల్లో అబద్దాలు ఆడితే వెంటనే దొరికిపోతారని అన్నారు. తెలివైన వారు ఎంపిక బోర్డులో ఉంటే వచ్చే ఉద్యోగం కూడా చేజార్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ సర్కార్ ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలాడి ఉద్యోగం తెచ్చుకోవాల్సి అవసరం ఉండదన్నారు. నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పి ఉద్యోగాలను పొందవచ్చని, సరీసులోకి వచ్చిన తరువాత మీకు పనితీరును బట్టి యాజమాన్యాలే మీకు పదోన్నతులు కల్పిస్తాయని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : warangal urban collector  aprapali  lies  job interviews  job aspirants  telanagana  

Other Articles