Kadiyam Counter to Collector Amrapali's lies Comments

Collector amrapali lies comments at job mela

Amrapali Kata, Collector Amrapali, Amrapali Kata, Amrapali Kadiyam Srihari, Telangana Minister Counter Collector, Amrapali Lies Comments, Collector Lies, Amrapali Speech Jobmela, Kadiyam Counter Amrapali, Kadiyam Srihari, Kadiyam Counter Amrapali, Amrapali Kata

Warangal urban Collector Amrapali Kata advised students at a job mela tell lies in interviews. But, Minister Kadiyam Srihari strong counter to her comments.

అబద్ధాల కలెక్టర్.. పంచ్ పడిందిగా...

Posted: 05/25/2017 11:21 AM IST
Collector amrapali lies comments at job mela

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్న బాహుబలి -2 సినిమా కోసం 500 టికెట్లను బుక్ చేసి మొత్తం ప్రభుత్వాధికారులకు సినిమా చూపించేసిన ఈ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, దానికి మంత్రి ఇచ్చిన కౌంటర్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

వరంగల్ ములుగు రోడ్డులో బుధవారం ఓ జాబ్ మేళా జరిగింది. ఇందులో ప్రసగించిన అమ్రపాలి ఇంటర్వ్యూలో గెలిచి ఉద్యోగం పొందాలంటే కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదని విద్యార్థులకు సూచించింది. నిజాయితీగా ఉంటే జాబులు రావని, ఐదు నిమిషాలు పని చేసే వారు కూడా రెండు గంటలు పని చేస్తామని చెప్పాల్సి వుంటుందని చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు అక్కడే ఉన్న తెలంగాణ విద్యా మంత్రి కడియం శ్రీహరికి కాస్త చికాకుపుట్టించాయి. వెంటనే మైక్ అందుకుని గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ప్రతిభతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలే తప్ప, అబద్ధాలు చెబితే అడ్డంగా దొరికిపోతారని హితవు పలికారు. మార్కుల జాబితా, అర్హతా పత్రాలు, అనుభవం విషయంలో ధ్రువపత్రాలు నిజాలనే చెబుతాయని, ఇంటర్వ్యూ చేసే బోర్డులో తెలివైన వారుంటే, అభ్యర్థి తప్పు చెబుతున్నాడని వెంటనే పసిగడతారని హెచ్చరించాడు. దీంతో రావాల్సిన ఉద్యోగం కూడా పోతుందని, అందుకే కలెక్టర్ గారి మాటలు వినకండంటూ విద్యార్థులకు సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Collector Amrapali Kata  Lies Comments  Kadiyam Srihari  

Other Articles