court sentences life term for ex mla chengala venkatrao చంగల్ వెంకట్రావుకు షాక్.. హత్యకేసులో జీవిత ఖైదు

Court sentences life term for ex mla chengala venkatrao

former MLA Chengala venkat Rao, life term for chengala, court sentences life term for chengala, balaiah producer gets life term, konda murder case chengala, chengal venkat rao, anakapalli court sentences chengala, YSRCP EX MLA chengala, Chengala venkat Rao, payakaraopeta ex mla chengala, crime, chengala venkat rao, YSRCP, EX MLA, former mla, payakaraopeta, visakhapatnam, life imprisonment, life term, anakapalli court

A former MLA Chengala venkat Rao from Andhra Pradesh visakhapatnam district been sentenced for life time imprisonment in a murder case by anakapalli sessions court.

ITEMVIDEOS: చంగల్ వెంకట్రావుకు షాక్.. హత్యకేసులో జీవిత ఖైదు

Posted: 05/24/2017 01:42 PM IST
Court sentences life term for ex mla chengala venkatrao

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చంగల వెంకట్రావుకు చెక్కెదైంది. అనకాపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఓ హత్యకేసులో ఆయనను దోషిగా నిర్ధారించి.. జీవిత ఖైదు శిక్షను విధించింది. విశాఖపట్నం జిల్లాపాయకరావు పేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన ఆయనతో పాటు మరో 15 మందిని కూడా హత్య కేసులో దోషిలుగా నిర్ధారించిన న్యాయస్థానం వారందరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది. 2007లో జరిగిన హత్యకేసులో వీరందరికీ ప్రమేయముందని భావించిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువరించింది.

పదేళ్ల క్రితం నక్కపల్లి మండలం బంగారమ్మ పాలెం బీఎంసీ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అందోళన జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారుడు కోశాల కొండ మృతి చెందాడు. ఆయన మృతికి చెంగల వెంకట్రావు అతని అనుచరులే కారణమని భావించిన కొండ కుటింబికులు న్యాయస్థానాన్ని అశ్రయించారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం చెంగల వెంకట్రావుతో పాటు అయన అనుచరులను దోషులుగా నిర్ధారించింది.

ఈ కేసులో సుదీర్ఘ విచారణ తరువాత పదేళ్లకు ఇవాళ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో చెంగల వెంకట్రావుతో పాటు ఆయన అనుచురులైన 15 మందికి న్యాయస్థానం జీవిత ఖైదీ శిక్షను ఖారరు చేస్తూ తీర్పను వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన మరో ఐదుగురికి రెండేళ్ల చోప్పున జైలు శిక్షను విధించింది. దీంతో పాటు ఈ ఐదుగురికి యాభై వేల రూపాయల జరిమాన కూడా విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles