Dog Interrupts News Bulletin, video goes viral న్యూస్ బులెటిన్ మధ్యలో అంతరాయం.. వీడియో వైరల్

Dog interrupts news bulletin video seen by 3 million

Dog Interrupts News Bulletin, live tv interuption by dog, dog video goes viral, dogs video seen by 3 millions, dog live show interruption, dog interrupts live tv, viral video

A clip of a news broadcast in Russia has gone viral for the cutest reason. The news reader was presenting a report about a demolition in Moscow when a loud bark from under the desk startled her.

ITEMVIDEOS: న్యూస్ బులెటిన్ మధ్యలో అంతరాయం.. వీడియో వైరల్

Posted: 05/23/2017 03:34 PM IST
Dog interrupts news bulletin video seen by 3 million

అదోక టీవీ కేంద్రం.. ఛానెల్ లో బులెటిన్ సమయం కాగానే.. పీసీఆర్ లోకి వెళ్లిన ఓ యాంకర్ సిరీయస్ గా వార్తలు చదువుతుంది. సరిగ్గా అమె ఓ సిరియస్ అంశానికి సంబంధించిన వార్తలను చదువుతుంది. అది కూడా మాస్కో నగరంలోని కూల్చివేత ఘటనపై అమె చెబుతున్న క్రమంలో ఓ పదిహేను నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఆ అంతరాయానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. అంతరాయానికి కారణం ఎవరన్న విషయం తెలియదు కానీ.. మొత్తానికి ఈ అంతరాయం వల్ల ఆ టీవీ ఛానెల్ కు మంచే జరిగింది.

అంతరాయం ఎందుకు ఏర్పడిందో చెప్పండ్రా బాబూ..? అని అంటున్నారు కదూ.. యాంకర్ లైవ్‌లో సీరియ‌స్‌గా వార్తలు చ‌దువుతున్న క్రమంలో అమెకు వెనుక నుంచి ఓ భీకర శబ్దం చిన్నగా వినిపించింది. ఆ తరువాత డెస్క్‌ కింద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దాంతో కంగారుపడిన యాంకర్ లైవ్ జరుగుతుండగానే.. ఇదేదో జంతువు అరుపులా వుందని హఠాత్తుగా కిందకు చూసింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా పీసీఆర్ గదిలోకి అనుకోని అతిధి అమె కోసం వచ్చేసింది.

అ అతిధి వేరేవరో కాదు శునకం. అవునండీ ఏకంగా కుక్క పీసీఆర్ గదిలోకి వెళ్లి న్యూస్ చదువుతున్న యాంకర్ దృష్టిని మరల్చింది. ఈ సంఘ‌ట‌న రష్యాలోని ఓ న్యూస్‌ ఛానల్ లో చోటు చేసుకుంది. అయినా త‌న ప‌నిని ఆప‌కుండా వార్తలు చదివింది. ఆమె ముఖంలో కొంత భయం, కొంత వణుకు కనిపించాయి. ఇంతలో ఆ కుక్క టేబుల్‌ మీదకు ఎక్కి పేపర్ల‌ను త‌న నోటితో తీసేందుకు య‌త్నించింది. ఈ దృశ్యం అంతా లైవ్‌లో కొన్ని సెక‌న్ల పాటు ప్రసారం అయింది. అనంత‌రం ఆ కుక్క‌ను గోముగా ప‌ట్టుకొని ఆ న్యూస్ రీడర్ నవ్వేసింది. ఈ వీడియోను సదరు న్యూస్‌ ఛానల్‌ యూట్యూబ్‌లో పోస్టు చేయ‌గా దీనిని ల‌క్ష‌లాది మంది వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : News show  Live TV  dog  news bullietin  news broadcast  Russia  

Other Articles