B.Tech girl gang raped by her Seniors in Hyderabad

B tech girl gang raped in hyderabad

B.Tech Gang Rape, B.Tech Student Rape, Hyderabad B.Tech Student Gang Rape, Boduppal Gang Rape, Seniors Gang rape junior, Ragging Rape Junior, Hyderbad Seniors Rape Junior, Gang Rape Accident Drama, Senior Lift and Rape, Rape Accident

A B.Tech Girl Student was allegedly gang raped by four seniors in an abandoned place here on Saturday. After They admitted her to a private hospital near Boduppal in an unconscious state. Doctors said a victim was admitted to hospital with head and leg injuries.

యువతి యాక్సిడెంటా? లేక గ్యాంగ్ రేప్?

Posted: 05/23/2017 08:22 AM IST
B tech girl gang raped in hyderabad

హైదరాబాద్ లో ర్యాగింగ్ భూతం మరోసారి వికృత రూపం దాల్చింది. ఏకంగా జూనియర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రమాదంలో గాయపడిన విద్యార్థినిని ఆస్పత్రిలో సీనియర్లు చేర్పించగా, ఆమెపై వారు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ శివారులోని బోడుప్పల్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువులోంది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని. ఎగ్జామ్స్ రాసేందుకు కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో బస్సు మిస్ అయ్యింది. దీంతో సీనియర్ అయిన ఓ విద్యార్థి బైక్ మీద డ్రాప్ చేస్తానని ఎక్కించుకున్నాడు. ఆపై యాక్సిడెంట్ జరగటంతో ఆమెను ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు సీనియర్లు కూడా ఉన్నారు. అయితే బైక్ కు చిన్న గీత కూడా పడకపోవటం, డ్రైవింగ్ చేసిన విద్యార్థి కూడా బాగానే ఉండటంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి.

ఆ విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ, ఇదంతా పథకం ప్ర‌కార‌మే చేసి, త‌న కూతురిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని అంటున్నాడు. ర్యాగింగ్ పేరుతో తరచూ వేధించేవారిని తన కూతురు తనతో చెప్పేదని, అఘాయిత్యానికి పాల్పడి పోలీసులకు బయపడి ఇలా డ్రామాలాడుతున్నారి ఆరోపిస్తున్నాడు. వైద్యులు కూడా ఆ ఆస్కారం ఉందని చెబుతున్నప్పటికీ ఏదనేది నివేదికలు వచ్చిన తర్వాతే తేలుస్తామని అంటున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ విద్యార్థిని కోలుకుంటే అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డుతుందని పోలీసులు ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Boduppal  Gang Rape  B.Tech Student  

Other Articles