Karti leaves to London, Chidambaram says he will be back కార్తి మరో మాల్యానా..? కాదంటున్న చిదంబరం

Karti leaves for scheduled trip to london chidambaram says his son will be back

CBI, Enforcement Directorate, karti chidambaram, CBI raid, CBI raids karti chidambaram house, CBI raids karti chidambaram offices, CBI raids chidambaram house, INX Media, Karti Chidambaram, Karti Chidambaram London trip, London, P Chidambaram

Former Union finance minister P Chidambaram’s son Karti has left for London. Chidambaram termed his son’s trip a “scheduled trip”.

కార్తి మరో మాల్యానా..? కాదంటున్న చిదంబరం

Posted: 05/19/2017 07:41 PM IST
Karti leaves for scheduled trip to london chidambaram says his son will be back

ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్కామ్, పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇప్పించి లంచాలు తీసుకున్నారన్న కేసులో ఆరోపణలు ఉన్నాయంటూ, సీబీఐ దాడులు చేసిన మాజీ హోం, ఆర్థికమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం లండన్ వెళ్లిపోయారు. ఆయన లండన్ వెళ్లిపోయారని చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు ధ్రువీకరించారు. అతని పాస్ పోర్టుపై ఆంక్షలేమీ లేకపోవడంతోనే ఆపలేకపోయామని తెలిపారు.

కార్తీపై తాజాగా ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐబీపీ క్లియరెన్స్ ఇప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా మూడు రోజుల క్రితం ఆయన ఇంటిలో సోదాలు కూడా జరిగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతుండగానే ఆయన లండన్ కు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కార్తి చిదంబరం వ్యవహారం అటు లలిత్ మోడీ, ఇటు విజయ్ మాల్యా వ్యవహారాలను గుర్తుకు తెస్తోంది. కార్తి కేసుల నుంచి తప్పించుకునేందుకు లండన్ పారిపోయారా..? లేక తిరిగి వస్తారా...? అన్న ప్రశ్నలు ఇప్పుడు తమళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

కాగా, తన కుమారుడు కార్తి చిదంబరం కొన్ని రోజుల తరువాత తిరిగి ఇండియాకు వస్తాడని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వెల్లడించారు. కార్తి లండన్ కు చెక్కేశారని, మరో మాల్యా అయ్యారని మీడియాలో వస్తున్న వార్తలపై చిదంబరం స్పందించారు. కార్తి లండన్ ప్రయాణం ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని, టికెట్లు కూడా ఎప్పుడో కొన్నవేనని వెల్లడించిన చిదంబరం, ఆయన ప్రయాణంపై ఎటువంటి నిషేధాలు లేవని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐని ప్రయోగించిందని, కార్తితో పాటు అతని స్నేహితులనూ ఇబ్బంది పెట్టడమే వారి లక్ష్యమని చిదంబరం ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  Enforcement Directorate  Karti Chidambaram London trip  London  P Chidambaram  

Other Articles