MP alleges circulation of ‘morphed pictures’ by AIADMK ఆ మహిళా ఎంపీకి తప్పని అశ్లీల గోల.. నెట్ లో ఫోటోలు..

Mp shasikala pushpa complaints police over her morphed images in net

AIADMK Expelled MP Sasikala Pushpa, sasikala pushpa, sasikala pushpa fir, sasikala pushpa police case, sasikala pushpa aiadmk, police case, aiadmk, morphed pictures, Delhi Policeindia news, latest news,

Following a complaint by Rajya Sabha MP Sasikala Pushpa, Delhi Police has registered a case against unknown persons for alleged circulation of “morphed pictures” and “obscene articles” against her on social media.

ఆ మహిళా ఎంపీకి తప్పని అశ్లీల గోల.. నెట్ లో ఫోటోలు..

Posted: 05/19/2017 02:43 PM IST
Mp shasikala pushpa complaints police over her morphed images in net

అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలకు మరీ కష్టాలు ఎక్కవయ్యాయి. మరీ ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలతో పాటు యువతులకు ఈ బెడత తప్పడం లేదు. ఇన్నాళ్లు తమ మార్ఫడ్ చిత్రాలను ఫోటోషాఫ్ చేసి అశ్లీల చిత్రాలుగా మారుస్తూ వాటిని నెట్ లో పెడుతున్నారంటూ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పోలీసులకు పిర్యాదు చేయగా, తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ఈ విషయమై పోలీసులను అశ్రయించారు. అమె ఫోటోలు, పోస్టులు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి.

తమళినాడులో ఇద్దరు యువతులు ఈ మార్ఫింగ్ ఫోటోల వల్ల బలవన్మరణాలకు పాల్పడినా.. ఇంకా అగంతకులకు కనువిప్పు కలగలేదు. కొందరు అగంతకులు ఇదే పనిగా సెలబ్రీటీల చిత్రాలను మార్ఫింగ్ చేస్తూ నెట్ లో పోస్టు చేస్తుండగా, మరికొందరు మాత్రం తమను ప్రేమించేందుకు నిరాకరించిన అమ్మాయిలను, లేదా తమను వివాహం చేసుకునేందుకు అయిష్టత వ్యక్తం చేసిన యువతుల చిత్రాలను మార్ఫింగ్ చేసి మరీ పనెట్ లో పెడుతున్నారు. అంతటితో అగకుండా వారి స్నేహితులకు కూడా మార్ఫింగ్ చిత్రాలను పంపుతున్నారు. దీంతో తమ పరువు పోయిందని భావించిన యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఇద్దరు యువతలు తమిళనాడులో అసువులు బాశారు. అయినా అగంతకులు నిసిగ్గుగా వ్యవహరిస్తూ.. అవే పనులకు పాల్పడుతున్నారు. తాగాజా వీరి బారిన ఎంపీ శశికళ పుష్ఫ కూడా పడ్డారు.

దీంతో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ తనను టార్గెట్ చేస్తున్నారని... తన పరువు మర్యాదలకు భంగం కలింగించే రీతిలో కొందరు అగంతకులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఏడీఎంకే అమ్మా పార్టీకి చెందిన కొందరు నేతలే తనను కావాలని టార్గెట్ చేస్తూ..ఈ దారుణానికి ఒడిగడుతున్నారని అమె దేశరాజధాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం  కింద కేసు నమోదు చేశామని... సైబర్ సెల్ దీనిపై దర్యాప్తు చేస్తుందని క్రైం విభాగం డీసీపీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sasikala pushpa  police case  aiadmk  morphed pictures  Delhi Police  

Other Articles