police issues notices to republic tv over IS tape అర్నబ్ రిపబ్లిక్ టీవీకి పోలీసుల నోటీసులు..

Hyderabad police issues notices to republic tv over is tape

arnab goswami, Criminal Case, theft, Times Now, hyderabad police, isis sympathisers, intervies, republic tv, freedom for press

The Hyderabad police issued notices to Arnab gosawmi's Republic Tv for airing islamic state sympathesisers interview, mentions will take action against tv managment.

అర్నబ్ రిపబ్లిక్ టీవీకి పోలీసుల నోటీసులు..

Posted: 05/19/2017 12:06 PM IST
Hyderabad police issues notices to republic tv over is tape

ధేశంలోని ఏ టీవీ ఛానెల్ అయినా.. లేక ఏ ప్రసారమాధ్యమమైన కొన్ని పరిధులకు లోబడే వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛ పేరుతో దేశ భధ్రతకు ప్రమాదకరమైన అంశాలను తీసుకుని వాటిపై కార్యక్రమాలను ప్రసారం చేయడమన్నది సహించరాని విషయం. మన దేశంలో పత్రికా స్వేచ్ఛపై జర్నలిస్టులు ఇంకా అప్పడప్పుడు గళం వినిపిస్తూనే వుంటారు. దీనికి కారణం రాజకీయ నేతలో, అధికారంలో వున్న ప్రభుత్వాలో ఏ పత్రికనైనా, లేక ప్రింట్ మాద్యామాన్ని టార్గెట్ చేసిన సందర్బాల్లోనే అవి వినబడుతుంటాయి. ఇక అధికార పార్టీలకు సానుకూలంగా, వ్యతిరేకంగా పలు మాద్యమాలు విడిపోయిన నేపథ్యంలో కూడా ఇలాంటి గొంతులు వినిపిస్తుంటాయి.

అయితే ఏకంగా దేశభద్రతకే ప్రమాదకరమైన అంశాలను టార్గెట్ చేసిన వాటిపై అభిప్రాయాలను, ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తే.. దేశప్రజలెవరూ సహించరు. తాజాగా 'టైమ్స్ నౌ' ఛానల్ కు రాజీనామా చేసిన ప్రముఖ జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామి 'రిపబ్లిక్ టీవీ' పేరుతో కొత్త న్యూస్ ఛానల్ ను స్థాపించడంతోనే వివాదాలలో చిక్కకుంటున్నారు. తమ వద్ద పనిచేసినప్పుడు తమ ఛానెల్ లో ప్రసారం చేసిన కొన్ని వీడియో, అడియో క్లిప్ లను అర్నబ్ దొంగలించారని టైమ్స్ నౌ యాజమాన్యం కేసు పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే.. తాజాగా అతని ఛానెల్ కు హైదరాబాద్ పోలీసులు మరో కేసుకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు.

అర్నబ్ గోస్వామి ఎడిటర్-ఇన్-చీఫ్ గా వ్యవహరిస్తున్న కొత్త న్యూస్ ఛానల్ 'రిపబ్లిక్ టీవీ' ఏకంగా ఐసిస్ సానుభూతిపరుల ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రిపబ్లిక్ టీవీకి నోటీసులు ఇచ్చారు. ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఐసిస్ సానుభూతిపరులైన సల్మాన్ మొహినుద్దీన్, ఖురేషి, అబ్దుల్లా బాసిత్ లను రిపబ్లిక్ టీవీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఐసిస్ తో సంబంధాలకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేసినందుకు నోటీసులు జారీ చేశారు. ఇక రిపబ్లిక్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన ముగ్గురు ఐసిస్ సానుభూతిపనులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arnab goswami  hyderabad police  isis sympathisers  intervies  republic tv  freedom for press  

Other Articles