Swathi Reddy Selfie Video before Committed Suicide

New twist in swathi suicide case

Swathi reddy Suicide Case, Swathi Suicide Case, Swathi Husband Naresh, Swathi Naresh, Selfie Video, Suicide Seifie Video, Swathi Elope Mumbaim, Naresh Missing Swathi Case

New Twist in Swathi Reddy Mysterious death. Swathi recorded Selfie video before committing suicde alleges Husband Naresh and his parents torture her.

ట్విస్ట్: సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో

Posted: 05/19/2017 09:57 AM IST
New twist in swathi suicide case

సంచలనం సృష్టించిన స్వాతి సూసైడ్ కేసులో కొత్త మలుపు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో అమ్మాయి విగతజీవిగా మారగా, యువకుడు కనిపించకుండా పోయాడు. యువతి తల్లిదండ్రులేమో అత్తమామల వేధింపుల కోణం బయటపెట్టారు. ఆ యువకుడు దొరికితే గానీ కేసు మిస్టరీ వీడే ప్రసక్తే లేదు. ఇంతకీ ఏం జరిగింది అనుకునేలోపు కొత్త ట్విస్ట్. సుమారు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న స్వాతి వీడియో వెలుగుచూసింది.

తాను ఆత్మహత్య చేసుకునే ముందు స్వాతి తీసిన సెల్ఫీ వీడియో అది. నరేష్ కుటుంబ సభ్యులు తమ వివాహం తరువాత తీవ్రంగా హింసించారని, కట్నం కోసం వేధించారని ఈ వీడియోలో స్వాతి వాపోయింది. తన ఆత్మహత్యకు నరేష్ తల్లిదండ్రులే కారణమని చెప్పుకొచ్చింది. వారు తనను కానుకలు అడిగారని, అవి ఇచ్చుకోలేమని చెబితే నిందించారని పేర్కొంది. తన బిడ్డ ఆత్మహత్యకు వరకట్న వేధింపులే కారణమని స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

 

సెల్ఫీ వీడియోలో స్వాతి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, వెంటనే నరేష్ తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, నరేష్ అదృశ్యమై మూడు వారాలు గడిచినా, ఇంతవరకూ ఆచూకీ లభించలేదు. అతన్ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని,లేకుంటే నివేదిక ఇవ్వాలని పోలీసులను న్యామూర్తి ఆదేశించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని తొలుత చెప్పిన పోలీసులు సెల్ఫీ వీడియో వెలుగు చూశాక నీళ్లు నమలటం పలు అనుమానాలకు తావిస్తోంది.

భువనగిరికి చెందిన స్వాతి రెడ్డి కులాంతర వివాహం చేసుకోవటంతో మొదట పరువు హత్యగా భావించారు. అయితే తర్వాత అది ఆత్మహత్యగా నిర్ధారణ కావటం, అంతకు ముందే తన కొడుకు, కోడలు కనిపించటం లేదంటూ నరేష్ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు క్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi Reddy  Suicide case  Naresh Missing  Selfie Video  

Other Articles