Raw food items to be exempted under GST శుభవార్త: నిత్యావసరాలకు ఆ జాబితాలో చోటు లేదు..

Gst rates decided on 1211 items milk and cereals exempt

GST rates, Arun Jaitley, GST Council meet, tax, finance minister, GST, luxury cars, Small Cars, Hasmukh Adhia, Foodgrains, milk, cereals

The GST Council, headed by finance Minister Arun Jaitley, is meeting for two days in Srinagar to finalise tax rates and approve rules for the new regime that is scheduled to kick off from July 1

శుభవార్త: నిత్యావసరాలకు ఆ జాబితాలో చోటు లేదు..

Posted: 05/18/2017 09:09 PM IST
Gst rates decided on 1211 items milk and cereals exempt

ప్రభుత్వాలు ఎంతో శ్రమకోడ్చి.. తీసుకోచ్చిన ఒక దేశం.. ఒకే పన్ను విధానం ఇక త్వరలో సాక్ష్యాత్కరించబోతుంది. ఈ తరుణంలో కొన్ని పార్టీల నిరసనలు, కొన్ని పార్టీల సానుకూలత నేపథ్యంలో ఎంతో ఉత్కంఠకు తెరతీసిన జీఎస్టీ రేట్లు దాదాపుగా ఖరారయ్యాయి. అయితే ఇందులో నిత్యావసర సరుకులకు చేరిక రమారమి లేనట్టుగానే వుంది. దీంతో జీఎస్టీ సామాన్యుడికి ఉపయోగపడే రీతిలోనే కనిపిస్తున్నాయి. జీఎస్టీ పుణ్యమాని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలావరకు తగ్గే అవకాశం కూడా వుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో జీఎస్టీ అంటే అదో బూచి అనుకున్న సామాన్యులు తమకు లాభం చేకూరుతుందన్న వార్త నేపథ్యంలో ఎప్పుడు అమల్లోకి వస్తుందా.. అంటూ ఎదురుచూస్తున్నారు.

జీఎస్టీ రేట్ల నుంచి పాలను పూర్తిగా మినహాయించారు. పాల అమ్మకాల మీద ఇకమీదట ఎలాంటి పన్ను ఉండబోదు. అలాగే ఆహార ధాన్యాలు కూడా ధరలు తగ్గుతాయి. వాటిమీద ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీని వాటికి కూడా పూర్తిగా మినహాయించారు. బొగ్గు మీద ప్రస్తుతం 11.69% పన్ను ఉండగా, జీఎస్టీని 5%కు పరిమితం చేశారు. అలాగే పంచదార, టీ, కాఫీ, వంటనూనెల మీద కేవలం 5% పన్ను మాత్రమే పడుతుంది. దాదాపు 60 శాతం వరకు వస్తువులు 12-18% శ్లాబు పరిధిలోకే వస్తున్నాయి. తలనూనెలు, సబ్బులు, టూత్ పేస్టుల మీద ప్రస్తుతం 28% ఉన్న పన్ను జీఎస్టీతో 18%కు తగ్గుతుంది.
 
మొత్తం 1,211 రకాల వస్తువుల మీద ఎంతెంత పన్ను విధించాలన్న విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఒక కీలక సమావేశంలో నిర్ణయించింది. 81% వస్తువులు 18% కంటే తక్కువ పన్ను పరిధిలోకే వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హస్ ముఖ్ ఆది చెప్పారు. జీఎస్టీలోని ఏడు నిబంధనలను కౌన్సిల్ ఆమోదించిందిని, మిగిలిన రెండింటిటిని మాత్రం ఒక లీగల్ కమిటీకి నివేదించామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమై సేవల మీద రేట్ల గురించి చర్చిస్తుందని అరుణ్ జైట్లీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GST rates  Arun Jaitley  GST Council meet  tax  finance minister  

Other Articles