Mukesh Tops Forbes Global Game Changers list జియో అంబానీకి అరుధైన గౌరవం

Mukesh ambani tops the forbes list of global game changers

Reliance Jio, Mukesh Amabni, Jio, Forbes Global Game Changers 2017 list, Prime membership, JioFiber, Jio broadband service, industrialist

Mukesh Ambani revolutionised the telecom sector with Jio in the past six months, which has reportedly helped him become the Global Game Chnager of the year.

గ్లోబల్ గేమ్ ఛేంజర్ జాబితాలో ముఖేష్ అంబానీ..!

Posted: 05/18/2017 03:45 PM IST
Mukesh ambani tops the forbes list of global game changers

రిలయన్స్ జియోతో యావత్ దేశంలో డాటా విప్లవాన్ని తీసుకువచ్చిన ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఏకంగా ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్‌ వెలువరించిన జాబితాలో తొలిస్థానాన్ని అక్రమించాడు. ఫోర్బ్స్ గ్లోబల్‌ గేమ్‌ ఛేంజర్స్‌ జాబితాలో టాప్ ప్లేస్ లో ముఖేష్ నిలిచారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 25 మంది పారిశ్రామికవేత్తల జాబితాలో ముఖేశ్ తొలి స్థానం దక్కించుకున్నారు. 120 కోట్ల మంది భారతీయులలో ఏకంగా పది కోట్ల మందిని తన వైపు అకర్షించడంతో ఆయన ప్రభావాన్ని గుర్తించిన ఫోర్బ్స్ ఈ గౌరవాన్ని ఇచ్చింది.

రిలయన్స్ జియోతో తక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌ను కూడా అందిస్తూ జియో 6 నెలల్లోనే 10 కోట్ల మందిని ఆకర్షించిన విషయం తెలిసిందే. దీంతో తన పోటీ సంస్థలకు కంటిమీద కునుకును కరువు చేస్తూ.. భారత టెలికాం రంగంలోనే రిలయన్స్ జియో సంచలనంగా ఆవిష్కారమైంది. మొబైల్ వినియోగంలో విప్లవాత్మకమైన మార్పుకు కారణం కావడంతో.. ముఖేష్ అంబానీ టాప్ ప్లేస్ లో నిలిచారు. టెలికాం చరిత్రలో రిలయన్స్ జియో.. ఓ ప్రభంజనంలా వచ్చి.. మొబైల్‌ వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అతి చేరువ చేసింది. ముఖేశ్‌కు అరుదైన గౌరవం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో ఆయనతో జేమ్స్‌ డైసన్‌, బ్లాక్‌ క్రాక్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఫింక్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Mukesh Amabni  Forbes list  Global Game Changers 2017 list  industrialist  

Other Articles