Big Relief to Kulbhushan Jadhav in ICJ

Icj stop pak from hanging kulbhushan jadhav

Kulbhushan Jadhav, ICJ Verdict, Top UN court, ICJ Kulabhushan Relief, Kulbhushan Jadhav Pak, Pak slam by ICJ Jadhav Case, Pakistan can not execute Kulbhushan Jadhav, ICJ verdict Kulbhushan Jadhav, Kulbhushan Jadhav Case, Kulbhushan Jadhav India Victory, Kulbhushan Jadhav India Favour

Kulbhushan Jadhav ICJ verdict. Top Court rules against Pakistan, stays Jadhav's Execution.

పాక్ కు దెబ్బ.. జాదవ్ కు తాత్కాలిక ఊరట

Posted: 05/18/2017 03:50 PM IST
Icj stop pak from hanging kulbhushan jadhav

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ కు చుక్కెదురైంది. భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ ఉరి విషయంలో స్టే విధిస్తూ భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది. చీఫ్ జస్టిస్ రోనే అబ్రహం నేతృత్వంలోని 11 మంది న్యాయమూర్తుల బెంచ్ కాసేపటి క్రితం తీర్పు వెలువరిచింది. జాదవ్ కేసులో పాక్ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతు ఉత్తర్వులు జారీ చేసింది.

తీర్పు ఏమని ఉందంటే...

భారత్ పాక్ లు వియన్నా ఒప్పందంలో భాగేనన్న చీఫ్ జస్టిస్ అబ్రహం జాదవ్ అరెస్ట్ వివాదాస్పదమైందని వ్యాఖ్యానించాడు. ఇక ఈ విషయం తమ దేశ భద్రతకు సంబంధించిందని, న్యాయపరిధిలోకి రాదన్న పాక్ వినతిని తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించాడు. భారత్ అభ్యంతరాలు సరైనవేనన్న ఆయన తమ పౌరుడిని కాపాడుకునే హక్కు భారత్ కు ఖచ్ఛితంగా ఉంటుందని స్పష్టం చేసిన బెంచ్ అందుకోసం దౌత్య మార్గాలను అనుసరించొచ్చని సూచించింది. ఇక తమ అంతర్గత వ్యవహారంలో దౌత్యపరమైన విషయాలు వద్దనే హక్కు పాక్ కు లేదని కూడా తేల్చేస్తూ ఉరిపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.

జాదవ్ కేసు... 

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన విష‌యం తెలిసిందే. 2016 మార్చి 3న ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ నుంచి పాక్ సైన్యం ఆయన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందని భారత్ వాదిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయ‌న‌పై గూఢ‌చారి అనే ముద్రవేయ‌డం ప‌ట్ల భార‌త్ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం భార‌త్, పాకిస్థాన్‌లు అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో త‌మ త‌మ వాద‌న‌లు కూడా వినిపించాయి. వియన్నా వాదనను ఉల్లంఘించిందని, దౌత్యపరమైన అవకాశం ఇవ్వలేదని భారత్ వాదించగా, ముమ్మాటికీ జాదవ్ భారత గుఢాచారినే అని అయినా దేశ భద్రత అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదని వాదించింది.

వాదనలను పూర్తి పరిశీలన చేసిన న్యాయమూర్తులు ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానంలో తీర్పు వెలువరించింది. ఒకవేళ ఇప్పటికీ పాక్ ఈ విషయంలో మరింత మొండిగా ముందుకెళ్తే మాత్రం ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించే ఆలోచనలో ఉంది. ఇక ప్రస్తుత తీర్పును అనుస‌రించి భార‌త్ కుల్ భూష‌ణ్ జాద‌వ్‌ను భార‌త్ కు ర‌ప్పించే అంశంలో త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kulbhushan Jadhav  ICJ Verdict  Pakistan  

Other Articles

 • Jayalalithaa death mystery inquiry continues

  అమ్మ డెత్ మిస్టరీ.. ఇక వీడదా!

  Jun 26 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతం మొదలైన రాజకీయ స్తబ్థత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. అన్నాడీఎంకే పార్టీ గ్రూప్ తగదాలు తారా స్థాయికి చేరగా, వాటిని వాడుకుని లాభపడేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా... Read more

 • Traffic cop denies pakistani legislator apoloy

  సారీ... మీ ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు!

  Jun 26 | ఇంతకీ నేనెవరో తెలుసా?.. ఈ ఒక్క డైలాగ్ తమను అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వీవీఐపీలు, వాళ్ల కొడుకులు దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితం... Read more

 • Shilpa mohan reddy counters akhila priya over nandyala bypoll

  నంద్యాల బైపోల్: ఒకరి ఎగ్జిట్ మాత్రం ఖాయం!

  Jun 26 | నంద్యాల ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారబోతుంది. అఖిల ప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి గా మారిన పోటీలో ఎవరిది గెలుపు అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు ప్రారంభమైపోయాయి. ఈ నేథప్యంలో తాను... Read more

 • Kesineni nani response on controversies

  నాని.. ఆల్ ఈజ్ వెల్ నిజమేనా?

  Jun 26 | రవాణా శాఖ అధికారిపై దాడి, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో క్లాస్ పీకించుకోవటం, తన ట్రావెల్స్ కు జరిగిన డ్యామేజ్, బీజేపీ పొత్తుపై కామెంట్లు... ఇలా ఆ మధ్య వరుస వార్తలతో టీడీపీ ఎంపీ కేశినేని... Read more

 • Anti naxal operation completed in chhattisgarh

  తూటాల వర్షం.. 40 మంది మృతి

  Jun 26 | ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మూడు రోజుల్లో నాలుగు ఎన్ కౌంటర్ లు చేసి సుమారు 40మంది మావోలను మట్టుపెట్టాయి. తొండమార్కా ఎన్ కౌంటర్ లో 20 మంది... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno