BBC Reporter says it was 'unintentional' యువతిని తాకరాని చోట తాకిన బిబిసీ రిపోర్టర్..

Bbc presenter slapped after accidentally touching woman s breast

BBC reporter slapped by student, reporter slapped by student, reporter ben brown slapped by student, ben brown slapped by student, BBC, ben brown, ben brown bbc, breast, viral video, woman, reporter, breast, new delhi

A BBC reporter is facing severe criticism for allegedly groping a woman’s breast during reportage on live television.

ITEMVIDEOS: యువతిని తాకరాని చోట తాకిన బిబిసీ రిపోర్టర్.. నెట్ లో వైరల్..!

Posted: 05/18/2017 01:07 PM IST
Bbc presenter slapped after accidentally touching woman s breast

బిబిసీ ఛానెల్ చూసే వారికి రిపోర్టర్ బెన్ బ్రౌన్ సుపరిచితుడు. మంచి అంశాలను తెరపైకి తీసుకువచ్చి.. వాటిపై ప్రముఖల అభిప్రాయాలను కూడా సేకరించి పలు వర్గాల ప్రజల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక మరోలా చెప్పాలంటే ఆయనకు కార్యక్రమాలకు కూడా అభిమానులు ఎందరో వున్నారు. అయితే ఏకంగా ఆయన చెంప చెల్లుమనించింది ఓ యువతి. అది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో బెన్ బ్రౌన్ తాను ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని, అయినా తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు.

లైవ్ లో భాగంగా ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో అనూహ్యంగా జరిగిన ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రాడ్ ఫోర్డ్ లోని ఓ ప్రాంతంలో జరిగిన ఇంటర్వ్యూలో నార్మన్ స్మిత్ ను బెన్ ప్రశ్నిస్తుండగా, ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉండి జరుగుతున్నది చూడకుండా, మధ్యలో కల్పించుకుంటూ, 'ఆబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్' అంటూ మాట్లాడబోయింది. లైవ్ ఇంటర్వ్యూలో అడ్డుతగులుతుందన్న ఉద్దేశ్యంతో బెన్ ఆ యువతనిని తన ఎడమ చెత్తో పక్కకు నెట్టాడు. అతని కుడి చేతిలో మొబైల్ ఫోన్, మరో పుస్తకం పట్టుకోవడంతో ఎడమ చెత్తో పక్కను నెట్టాడు.

అయితే బెన్ అమెను పక్కకు జరిపేందుకు మాత్రమే చేసిన ఈ చర్యలో.. అతని ఎడమ చెయ్యి నేరుగా యువతి గుండెలపై పడింది. ఆ యువతి గుండెలపైనే బెన్ చేయి పడటం, అది లైవ్ లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఈ ఘటన తరువాత సదరు యువతి సైతం లైట్ గా తీసుకుని వెళ్లిపోయింది. అంతేకాదు వెళ్తూ వెళ్తూ.. బెన్ భుజంపై ఓ మారు తట్టి మరీ వెళ్లిపోయింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశమైంది.

దీంతో బిబిసి రిపోర్టర్ బెన్ బ్రౌన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు. ఈ ఘటన అనుకోకుండానే జరిగిందని.. తాను ఉద్దేశపూర్వకంగా అమెను తాకలేదని చెప్పాడు. ఇది దురదృష్టవశాత్తూ జరిగిన పరిణామంగా చెప్పుకోచ్చాడు. ఇంటర్వ్యూ మధ్యలో అంతరాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో బెన్ ను కొందరు విమర్శిస్తుండగా, ఆయన తప్పేముందని మరికొందరు వెనకేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలియక చేయడంతో అధికమంది బెన్ కు సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BBC  ben brown  ben brown bbc  breast  viral video  woman  reporter  breast  new delhi  

Other Articles