China Issues warning for new Ransomware Virus

China found new ransomware virus

UIWIX Virus, China New Virus, Wanna Cry Danger, China New Virus, Malware, Virus Attack

China warns of new ransomware virus. Chinese authorities have warned computer users of a new ransomware virus detected abroad. The National Computer Virus Emergency Response Center (CVERC) and software company AsiaInfo today detected the "UIWIX" virus, which is spreading in a way similar to the "WannaCry" ransomware.

వాన్నా క్రై కాదు.. అంతకు మించి

Posted: 05/18/2017 01:01 PM IST
China found new ransomware virus

వాన్నా క్రై దెబ్బకి ప్రపంచం అంతా వణికిపోతుంది.150కి పైగా దేశాల్లో లక్షల కంప్యూటర్లను పట్టి పీడిస్తున్న ఈ ర్యాన్సమ్ వేర్ వైరస్ కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా బ్లాక్ మెయిలింగ్ పేరిట హ్యాకర్లు 50,000 డాలర్ల దాకా సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే అంతకు మించిన మరో ముప్పు మున్ముందు పొంచి ఉందని హెచ్చరిస్తోంది చైనా. వాన్నా క్రై కన్నా ప్రమాదకరమైన వైరస్ ను చైనా కనుగొన్నట్లు ప్రకటించింది ఇప్పుడు. అత్యాధునిక కంప్యూటర్లతోపాటు స్మార్ట్ ఫోన్లను పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం ఉన్న వైరస్ గురించి వార్త రావటంతో కలవరపాటుకు గురిచేస్తోంది.

చైనాలోని జాతీయ కంప్యూటర్ వైరస్ అత్యవసర స్పందన కేంద్రం (సీబీఈఆర్సీ) ఓ ప్రకటన వెలువరుస్తూ.. షాడో బ్రోకర్లు ఎంఎస్17-010 గా దానికి పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ వైరస్ సోకితే కంప్యూటర్లు పూర్తిగా స్తంభించి పోతాయని, వాన్నా క్రై కన్నా ఇది చాలా బలమైనది, ప్రమాదకరమైనదని హెచ్చరించింది. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే వాన్నా క్రై వచ్చిన అదే ఎస్ఎంబీ 'సర్వర్ మెసేజ్ బ్లాక్'నుంచే ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందుతోందని నిపుణులు వెల్లడించారు.

సిస్టమ్స్ ను పట్టుకుని పీడించడంతో పాటు, దానితో అనుసంధానమైన నెట్ వర్క్ కంప్యూటర్లకు విస్తరిస్తుందని, తనంతట తానుగానే బాధితులను వెతుక్కుంటుందని తెలిపారు. ఏ విధమైన ఫైల్ రూపంలో లేకుండానే ఇది సోకుతుందని, కంప్యూటర్ డిస్క్ లలోకి చొరబడి పాతుకుపోతుందని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ వైరస్ కోడ్ స్ట్రింగ్స్ ప్రకారం, ఇది సోకితే బ్రౌజర్ లాగిన్స్ అన్నీ స్తంభించిపోతాయని, ఎఫ్టీపీ (ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రొటోకాల్), ఈమెయిల్, మెసింజర్ వంటి వాటితో పాటు డేటాపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyber Attack  China  New malware  

Other Articles

 • Saudi arabia put porn in top of ban list

  బూతు వీడియోలు ఉంటే బుక్కయినట్లే...

  Jul 24 | అడల్ట్ కంటెంట్ ను పూర్తిగా బ్యాన్ చేయలేని దేశాలు కాస్త.. కూస్తో రూల్స్ తో కంట్రోల్ చేసేందుకు యత్నిస్తున్నాయి. మన దేశంలో అది సాధ్యమయ్యే పని కాకపోయినప్పటికీ, శిక్షలు కఠినంగా అమలు అయ్యే సౌదీ దేశాల్లో... Read more

 • Man founds a bag with 36 lakh cash carries away

  ITEMVIDEOS: లక్షల సొమ్ము దొరికినా.. టెన్షన్ లేకుండా తీసుకెళ్లాడు..

  Jul 24 | నవ్యంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ బీసెంట్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు పాదచారులలో ఒకరిని లఛ్చిందేవి వరించింది. ఇంకేముందు అప్పటి వరకు దిగాలుగా, నీరసంగా వేసిన అడుగులు కాస్తా.. వడివడిగా తన గమ్యం వైపు సాగాయి.... Read more

 • Nithari killings pandher koli sentenced to death in pinky sarkar case

  సీరియల్ కిల్లింగ్స్ కేసులో దోషులకు మరణ దండన

  Jul 24 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిథారీ సీరియల్ మర్డర్ల కేసులో వ్యాపారవేత్త వ్యాపారవేత్త మొనీందర్ సింగ్ పాంధర్, అతని ఇంట్లో పనిమనిషి సురీందర్ కోలీలకు సీబీఐ ప్రత్యేక కోర్టు మరణదండన విధించింది. వీరిద్దరూ కలసి పింకీ... Read more

 • Charmi approches high court in drugs case

  హైకోర్టుకు నటి చార్మీ.. వెసులుబాటు కల్పించాలట..

  Jul 24 | తెలుగు సినీ పరిశ్రమకు చెందని అనేక మందిని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. వాటితో లింకులున్న వారందిరిలో వణుకుపుట్టిస్తుంది. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో... Read more

 • High technology in kirlampudi over mudragada yatra

  టెక్నాలజీతో ముద్రగడ యాత్రకు చెక్!

  Jul 24 | చలో అమరావతి పేరిట కాపు కాపరి ముద్రగడ పద్మనాభం తలపెట్టబోతున్న పాదయాత్రకు అనుమతి నిరాకరణ ద్వారా ఏపీ ప్రభుత్వం మరిన్ని విమర్శలను మూటగట్టుకుంటోంది. మరోవైపు పోలీసులు కూడా దీనిని అడ్డుకునేందుకు దారులన్నీ మూసేస్తున్నారు. ఇందుకోసం... Read more

Today on Telugu Wishesh

porno