Pervert in Singapore taking video of woman in MRT మగాడి వంకర బుద్దికి.. మహిళ ఫేస్ బుక్ దెబ్బ

Woman exposes man who secretly filmed her on nel train

man on singapore mrt films girl, man on metro makes video of girl, uma mageswari facebook man makes video of girl on singamore metro, uma mageswari facebook reveals man making video on metro singapore, indian pervert mrt, pervert singapore, singapore pervert, mrt pervert, pervert mrt, indian man video woman, indian man caught video woman, man caught video,

A man was caught secretly filming a woman on a North East Line MRT train. In an ironic twist, the man was exposed by none other than his victim, known as Ms Uma Mageswari.

ITEMVIDEOS: మగాడి వంకర బుద్దికి.. మహిళ ఫేస్ బుక్ దెబ్బ

Posted: 05/17/2017 06:36 PM IST
Woman exposes man who secretly filmed her on nel train

దేశం కాని దేశంలో దేశం పరువును తీశాడో భారతీయుడు. అయితే పరదేశంలోనూ మన భారతీయ యువతని అసభ్యంగా చిత్రీకరించి వెదవ్వేషాలు వేశాడు. మెట్రో రైలులో అకతాయి పనులు చేసిన వాడ్ని యువతి మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకుంది. అంతటితో అగకుండా ముందుగా అకతాయి పరువును దెబ్బతీసి.. ఆ తరువాత అతడికి గట్టిగా బుద్దిచెప్పాలనుకుంది. సింగపూర్ మెట్రలో రైలులో తన ఎదురు సీట్లో ఉన్న యువతిని ఫోన్లో వీడియో తీస్తూ.. ఎవరికీ తెలియలేదని అనుకున్నాడు. రైలు మొత్తం ఖాళీగా ఉన్నా, అతడు సరిగ్గా ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చున్నాడు.

మొల్లిగా జేబులోంచి ఐఫోన్ తీసి, దాంట్లో ఏదో చూస్తున్నట్లుగా సీరియస్‌గా స్క్రీన్ వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఒకే విధంగా పట్టుకున్నాడు. అతడు ఫోన్ పట్టుకున్న తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో యువతికి అనుమానం కలిగింది. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, అతడి వెనకాల ఉన్న కిటికీ అద్దం మీద ఆ ఫోన్‌లో ఏం చేస్తున్నదీ స్పష్టంగా కనిపించింది. అతడు తననే వీడియో తీస్తున్నట్లు యువతి గుర్తించింది. ఏమీ ఎరగనట్లుగా తాను కూడా ఫోన్ తీసి అతగాడిని షూట్ చేయడం మొదలుపెట్టింది. తానెం తక్కువ తిన్నానా అన్నట్టుగా అనుమాన కలగకుండా అకతాయి పనులను సెల్ లో బంధించింది.

ఇక తాను దిగాల్సిన రైల్వే స్టేషన్ రాగానే ఆ వ్యక్తితో వాదనకు దిగింది. తాను చేసిన పనులు పై పోలీసులకు పిర్యాదు చేసింది. తాను ఏ పాపం ఎరుగననిన నమ్మబలికిన అకతాయి.. అమె తన సోదరి లాంటిదని కూడా బుకాయించి తప్పించుకోవాలని చూశాడు. క్షమాపణలు చెబితే వదిలేద్దమని బావించిన యువతికి ఎంతకీ మన్నించమని కోరలేదు. అయితే రకరకాల కారణాలు చెప్పుకుంటూ తప్పించుకోవాలని చూశాడే తప్ప ఎంతకీ తాను చేసిన తప్పును అంగీకరించలేదు.

దీంతో అతగాడి వీడియోను యువతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోను కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మంది చూశారు. అంతేకాదు, వీడియో తీసిన తర్వాత.. నువ్వు చేస్తున్న పనేంటి అంటూ అతడితో గొడవపడి, స్టేషన్ వచ్చిన తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద ఇలాంటివే చాలా వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. గుర్తుతెలియని మహిళలను అత్యంత అసభ్యకరమైన రీతిలో అతడు వీడియో తీశాడని ఆమె తన పోస్టులో రాశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనే తాను అందరి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నట్లు ఆమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

  ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

  Jul 18 | అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు... Read more

 • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

  కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

  Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

 • Supreme court to take decision on petition of karnataka rebel mlas today

  కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం!

  Jul 17 | మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు... Read more

 • Trafic challans on violation of motor vehicle rules

  బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

  Jul 16 | ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక... Read more

 • Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

  ఏపీకి కొత్త గవర్నర్‌

  Jul 16 | ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర... Read more

Today on Telugu Wishesh