రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనమైన వేడుకలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు భావిస్తున్న క్రమంలో ఆయనకు పోటీగా టీజేఏసీ కన్వీనర్ ప్రోఫెసర్ కోదండరామ్, ప్రజా గాయాకుడు గద్దర్ సహా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉద్యమిస్తున్న నేతలు ఐక్యంగా ఇంటి పార్టీ వేడుకలకు హాజరుకానున్నారు. ఇంటి పార్టీ అంటే అదేదో టీ పార్టీనో, లే కాక్ టైల్ పార్టీనో కాదు. తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా శ్రమించిన చెరుకు సుధాకర్ నేతృత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీ అవిర్భావ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
గులాభి దండుకు వ్యతిరేకంగా, గులాబి బాస్ నిరంకుశ విధానాలకు, నియంత పోకడలను ఎండగడుతూ.. ఆవిర్భవించనున్న కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. తెలంగాణలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న జూన్ 2 వేదికగా ఈ నూతన రాజకీయ వేదిక ఏర్పడనుంది. ఈ పార్టీకి కేసీఆర్ ఒకనాటి ఆప్తుడు తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నడుం బిగించారు. మరో ఆసక్తికరమైన పరిణామం...ఈ పార్టీకి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పూర్తి ఆశిస్సులు, ప్రజాగాయకుడు గద్దర్ అండదండలు వున్నట్లు తెలుస్తుంది.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఉద్యమ శక్తులు ఏకం అవుతూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా పార్టీని ప్రకటించనున్నారు. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ఆవిర్భావంలో భాగంగా తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయించారు. వచ్చే నెల 2న పార్టీ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథులుగా ఆర్ఎల్డి నేత అజిత్ సింగ్ కూడా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఉస్మానియా, కాకతీయ వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థుల మద్దతు ఉన్నట్లు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టారు. ఇందిరా పార్కు వద్ద అనేక సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్‌ను ఎత్తి వేయడం మిర్చి రైతులకు కనీస మద్ధతు ధర లభించకపోవడం రైతులకు బేడీలు వేయించడం వంటి ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమ పార్టీలన్నీ కలిసి రావాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉంది కాబట్టి ఇదే సరైన సమయమని సుధాకర్ అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more