Mulayam Singh Yadav Allegations for SP Woes

Blame game within sp after poll defeat

Mulayam Singh Yadav, SP Chief Mulayam, Mulayam Akilesh Mistake, Regret making Akhilesh CM, Mulayam Singh Biggest Mistake, Mulayam Blames Akilesh Yadan, Mulayam Blames Congess Akilesh, Mulayam Mistake, Samajwadi Defeat Reason

Samajwadi Party Chief Mulayam Singh Yadav says making Akhilesh CM was a 'mistake', Blames Congress for SP woes.

వాళ్లే నన్ను సర్వ నాశనం చేశారు: ములాయం

Posted: 05/08/2017 08:01 AM IST
Blame game within sp after poll defeat

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన పతనానికి కారణాలు అంటూ కాంగ్రెస్, తనయుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆక్రోశం వెల్లగక్కాడు. తనపై ఎన్నో కేసులు పెట్టి, నానారకాలుగా వేధించిందని, చివరకు జీవితంలో ఏనాడు లేనివిధంగా ఎస్పీ ఓడిపోవటానికి కూడా కారణం అయ్యిందని వ్యాఖ్యానించాడు.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానాకి కారణం ప్రజలు కాదని, తమ స్వయం కృతాపరాధమేనని(కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి) ప్రస్తావించాడు. ఈ విషయంలో బీజేపీకి పట్టం కట్టిన ఓటర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇకనైనా మేలుకుని పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇక తనయుడు అఖిలేష్ యాదవ్ పై కూడా ధ్వజమెత్తాడు.

నాడు(2012 ఎన్నికల గెలుపు) అఖిలేష్ యాదవ్ కు బదులు తానే ముఖ్యమంత్రిని అయి ఉంటే బాగుండేదని, తాను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదేనని అభిప్రాయపడ్డాడు. తలా తోక లేని నిర్ణయాలతో అఖిలేష్ పార్టీకి భారీ డ్యామేజ్ చేశాడని చెప్పాడు. నిజానికి పార్టీ తరపున తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. కానీ, ఆచరణ విషయంలోనే అఖిలేష్ ఎలాంటి పురోగతి చూపలేకపోయాడు. పైగా తండ్రి మాటే వినలేని వాడు.. ఇక ప్రజలకేం చేస్తాడన్న మోదీ ఆరోపణలను తిప్పికొట్టలేకపోవటం ప్రజల్లో బాగా నాటుకుపోయిందన్నాడు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది, ముస్లింలు ఎప్పటికీ ఆ పార్టీ ఓటు వేయరని.. ఇప్పుడు కూడా అదే జరిగిందని ములాయం చెప్పుకొచ్చాడు.

మరోవైపు 'సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా' పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు సోదరుడు శివపాల్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ములాయం సింగ్ నాయకత్వంలో ఈ పార్టీ నడుస్తుందని చెప్పాడు కూడా. కానీ, ములాయం తాజా వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీ విషయంలో అయిష్టతే చూపుతున్నట్లు స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mulayam Singh Yadav  SP Woes  Congess  Akilesh Yadav  

Other Articles