Boat capsizes in Andhra Pradesh's Anantapur district 14 Killed

14 drown as boat capsizes in anantapur district

Boat Capsize, Ananthapur Boat Mishap, Boat Accident Andhra Pradesh, Andhra Pradesh Boat Capsize, Anantapur District, YT Cheruvu Mishpa, Erratimma Raju Lake Boat, Anantapur Boat Sink, Boat Capsizes in Lake, Pawan Kalyan Anantapur Boat Capsize, Guntakal Boat Capsize, 14 Killed Boat Capsize

14 members of a family died and two others are missing after their boat capsized in the Erratimma Raju lake in Andhra Pradesh's Anantapur district on Friday.

ITEMVIDEOS:అనంత విషాదంకు అసలు రీజన్ అదేనా?

Posted: 04/29/2017 08:18 AM IST
14 drown as boat capsizes in anantapur district

అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువు(వైటీ చెరువు) గుండా ఓ తెప్పలో ప్రయాణికులు వెళుతుండ‌గా ఒక్క‌సారిగా అది బోల్తా ప‌డింది. ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మిగతా వారంతా గ‌ల్లంతుకాగా ఈ ఉదయం మరో దేహం దొరకటంతో సంఖ్య 14కు చేరింది. ఇంకా ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో ఆరుగురు మ‌హిళ‌లే ఉన్నారు. ఈ ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న స‌హాయ‌క సిబ్బంది గ‌ల్లంతైన వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

మొత్తం 19 మంది ప్రయాణికులతో తెప్ప వెళ్తుంది. మృతులు, గ‌ల్లైంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడంతోనే తెప్ప తిరగబడి ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకన్నా ఎక్కువ మందితోనే ప్రయాణాలు సాగిన రోజులు ఉన్నాయని, ప్రమాదంపై తమకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

 

ఇక ఈ ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మంత్రి ప‌రిటాల సునీత‌తో ఆయ‌న మాట్లాడి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఘ‌ట‌నా స్థలిలో స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి సునీత మీడియాతో చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు అన్ని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఇప్ప‌టికే సంబంధిత అధికారుల‌ను ఆదేశించామ‌ని చెప్పారు.

పవన్ దిగ్భ్రాంతి...

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువు దుర్ఘటనపై జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మరణించడం బాధాకరంగా ఉందని అన్నారు. వారి మరణానికి సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాద దృశ్యాలు గుండెలు పిండేసివిగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇకనైనా మేల్కోని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన రాజకీయ పార్టీలను కోరారు. బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anantapur  Boat Capsize  14 Killed  

Other Articles