Case filed against six Dhinakaran supporters దినకరణ్ మద్దతుదారులపై కేసు.. మంత్రికి చేదు అనుభవం

Bitter experiance to tamil nadu minister natarajan

Case filed against six Dhinakaran supporters, case against dhimakaran supporters, AIADMK, T.T.V. Dhinakaran, supporters, natarajan, rajaraja cholan, sasikala, palanisamy, tamil politics

The police registered a case against six persons, including M.D. Rajaraja Cholan, all supporters T.T.V. Dhinakaran, for creating trouble at a government function attended by Tourism Minister Vellamandi N. Natarajan.

దినకరణ్ మద్దతుదారులపై కేసు.. మంత్రికి చేదు అనుభవం

Posted: 04/23/2017 12:31 PM IST
Bitter experiance to tamil nadu minister natarajan

తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి వెల్లమండి నటరాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తిరుచ్చి రాక్‌ఫోర్ట్ అందాలను వీక్షించేందుకు పర్యాటక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెలీస్కోప్ ను ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రిని టీటీవీ దినకరన్ మద్దతుదారులు అడ్డుకున్నారు. దినకరణ్ ను పార్టీ నుంచి దిగిపోవాలని చెప్పడానికి మీరెవరని ఆయనతో వాగ్వాధానికి దిగారు. టెలీస్కోప్ ను అవిష్కరించిన తిరుగు పయనం అవుతున్న మంత్రిని దినకరణ్ వర్గానికి చెందినవారు మంత్రి కారును అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. మంత్రి నటరాజన్, దినకరన్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

దినకరన్ వర్గానికి చెందిన రాజరాజ చోళన్ ఆధ్వర్యంలో కొందరు ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మా నాయకుడ్ని పార్టీ  పదవి నుంచి ఎందుకు తప్పించారని నిలదీశారు, పార్టీకి అ అధికారం వుంటుందని చెప్పిన మంత్రి వ్యాఖ్యలపై అగ్రహం వ్యక్తం చేసిన దినకరణ్ మద్దతుదారులు మంత్రికి, పార్టీ వర్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి, అయితే మంత్రి అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో చోళన్ వర్గీయులు అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రి ఫిర్యాదుతో చోళన్ వర్గానికి చెందిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  T.T.V. Dhinakaran  supporters  natarajan  rajaraja cholan  sasikala  palanisamy  tamil politics  

Other Articles