policeman savagely thrashed for fining politician's relatives బీజేపి నేతలా మజాకా..? పోలీసుపై నడిజబార్లో దౌర్జన్య పర్వం..!

Policeman savagely thrashed for fining politician s relatives

Shobhna Raghuvanshi, BJP block president, Rajiv Raghuvanshi, traffic violations, constable Ashutosh Tiwari, Guna, Cop Attacked, Policeman beaten up, Shobhna Raghuvanshi, Madhya Pradesh police

police constable is thrown to the ground, punched and kicked repeatedly by the family members of a local BJP leader. The savage attack was captured on cell phone cameras went viral on social media.

ITEMVIDEOS: బీజేపి నేతలా మజాకా..? పోలీసుపై నడిజబార్లో దౌర్జన్య పర్వం..!

Posted: 04/23/2017 11:46 AM IST
Policeman savagely thrashed for fining politician s relatives

ప్రజాశేయస్సు, వారి శాంతిభద్రతలే లక్ష్యంగా ఎండా, వానలు తేడాలేకుండా అహర్నిశలు కష్టపడే పోలీసులపైనే రాజకీయ నేతలు దాడి చేస్తే.. సభ్యసమాజంలో పౌరుల రక్షణే తమ ప్రధమ విధిగా భావించిన ఓ పోలీసు పట్ల రాజకీయ నేతలు దారుణంగా వ్యవహరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అటు కేంద్రం, ఇటు రాస్ట్ర ప్రభుత్వాలు అదేశిస్తున్న తరుణంలో దానిని అతిక్రమించి వాహనాన్ని నడపడంతో పాటు త్రిబుల్ రైడింగ్ కూడా చేసిన ముగ్గురు యువతులను అపి ఫైన్ వేశాడు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్.

అయితే తమ నిబంధనలు సామాన్య జానాలకే. మాకు వర్తించవని చెప్పి రాజకీయ నేతలు పోలీసుపై విరుచుకుపడ్డారు. తమ ఇంటి అడపిల్లలమని చెప్పినా.. పోలీసు అధికారిని నట్టనడి వీధిలో ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారు. అతడిపై పిడిగుద్దులు, తన్నుల వర్షం కురిపించారు. ఏకంగా ఐదుగురు ఒకేసారి మీదపడి దారుణంగా దాడి చేసి కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని భోపాల్ కు 200 కిలోమీటర్ల దూరంలోని గునాలో చోటుచేసుకుంది. ఇంత జరిగింది స్థానింకగా వున్న పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కు కూతవేటు దూరంలోనేనని తెలిసింది.

గునాలోని బీజేపి నాయకురాలి బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారు. శోభనా రఘువంశి అనే మహిళా బీజేపి నేత స్థానికంగా బ్లాక్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అమె కుటంబానికి చెందని ముగ్గురు యువతులు హెల్మెట్‌ లేకుండా వెళ్లడం.. అదీ త్రిబుల్ రైడింగ్ చేయడంతో ఫైన్ వేశారు. దీంతో విషయం తెలుసుకన్న శోభనా భర్త రాజీవ్ రఘువంశీ పలువురు అనుయావులతో వచ్చి నేరుగా కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లి పోలీసును కాలర్‌ పట్టుకొని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. వారి దెబ్బలకు తాళలేక కిందపడినా వారు కనుకరించలేదు. చివరకు సహచర పోలీసులు వచ్చి అతడ్ని రక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guna  Cop Attacked  Policeman beaten up  Shobhna Raghuvanshi  Madhya Pradesh police  

Other Articles