Indian IT firms don't steal jobs, create them says Ravi Shankar Prasad భారత్ ఉద్యోగాలను సృష్టిస్తుంది.. దొంగలించదు

Indian it firms don t steal jobs create them says ravi shankar prasad

Ravi Shankar Prasad, H1B visas, T and Electronics System Design Manufacturing industries, IT companies, Arun Jaitley, Donald Trump, United States

Indian IT companies, which conquered the world with their software skills, don't steal jobs anywhere in the world but create them, asserted Union IT Minister Ravi Shankar Prasad

ఐటీ ఉద్యోగాలను భారత్ సృష్టిస్తుంది.. కానీ దొంగలించదు

Posted: 04/23/2017 10:54 AM IST
Indian it firms don t steal jobs create them says ravi shankar prasad

అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నప్పటి నుంచి ఆ దేశంలోకి వలసలు నిలపివేస్తూ.. పలు అంక్షలు విధించారు. ఇదే క్రమంలో యుఎస్ కు వచ్చే వలసదారులపై కూడా అనేక అంక్షలు విధించారు. ఈ అంక్షల ప్రభావంతో భారతీయ యువకుల అనేకమంది ఉఫాధి, ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోయారు. అమెరీకన్ ఇమ్మిగ్రేషన్ విధానంపై భారత ప్రభుత్వం స్పందించడం లేదేమని దేశీయ యువతతో పాటు అగ్రరాజ్యంలోని ప్రవాస భారతీయులు కూడా వేచిచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు కేంద్ర ఐటీ శాఖ స్పందించింది.

ఈ విషయమై కేంద్ర ఐటీ శాఖామంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్రంప్ విధానాలపై ఎక్కుపెట్టి ఘాటుగా స్పందించారు. విదేశీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ ఐటి కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి తప్ప దొంగిలించవని రవిశంకర్ ప్రసాద్ తేల్చిచెప్పారు. దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ హెచ్‌ 1బీ వీసాలపై విధించిన కొత్త ఆదేశాలపై స్పందించారు. అంతేకాదు వరుస ట్వీట్లలో  ఐటీ కంపెనీల సామర్థ్యాలపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  భారతీయ ఐటీ కంపెనీలకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, బిగ్‌ డేటా  తదితర  అంశాల్లో భారీ అవకాశాలున్నాయని ట్వీట్‌ చేశారు.  

భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలో గాని ఉద్యోగాలను దొంగిలించవని స్పష్టం చేశారు. బహుళ జాతి సంస్థల పెద్ద వ్యాపారంలో మన దేశ ఐటీ ఉద్యోగుల భాగస్వా‍మ్యం అవసరమన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఐటీ సంస్థలు కూడా  ఇప్పుడు భారత్ వైపు తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ‘డిజిటల్‌ ఇండియా’తో విస్తృత మార్కెట్‌ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవల వైపు చూడాల్సిన సమయం వచ్చిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Shankar Prasad  IT ministry  Indian IT companies  IT jobs  IT employees  Narendra Modi  

Other Articles