Man eats meat, wife seeks divorce మాంసాహారం తిన్న భర్త.. విడాకులు కోరిన భార్య

Man eats meat wife seeks divorce

Rima Doshi, Jain community, vegetarian, Karan Chandela, Sola Bhagwat, Rajput, Bihar, divorce, torture, OPT FOR DIVORCE, Marriage, inability to compromise over their food habits, HUSBAND EATS NON-VEG FOOD

A 23-year-old Amdavadi has filed an application with the police, accusing her husband of five years of torturing her. Her grouse is that he eats non-vegetarian food - reportedly breaking his promise of staying off meat once they get married.

మాంసాహారం తిన్న భర్త.. విడాకులు కోరిన భార్య

Posted: 04/22/2017 08:51 PM IST
Man eats meat wife seeks divorce

పెద్దలను ఎదురించి.. చివరకు ఒప్పించి మతాంతర వివాహం చేసుకుంది. మతాచారం మంటగలిపాడని విడాకులు కావాలంటుంది. త‌మ త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌ని ఎంత వారించినా విన‌కుండా తాను కోరుకున్న ప్రియుడినే పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని తనను తాను నిందించుకుంటుంది. అయితే, మతాచారం ఎలా మంటగలిపాడని సంగతి తెలిస్తే.. మాంసాహారులకు ఇది పెద్ద తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ శాఖాహారులకు అందులో చీమలకు కూడా హాని కలిగంచకుండా వెళ్లే జైన మతస్థులకు మాత్రం ఇది పెద్ద అపచారమే.

పెళ్లి సమయంలో. అంతకుముందు తమ ప్రేమ వ్యవహారం నడుస్తున్న సమయంలోనూ అనేక బాసలు చేసిన తన భర్త.. పెళ్లైన నాటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం లేదని, మాంసాహారం తింటున్నాడని, అంతటితో అగకుండా తనను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ యువ‌తి ఇప్పుడు విడాకులు తీసుకోవడం కోసం కోర్టుకెక్కింది. అయితే అందుకు అ వివాహిత తల్లిదండ్రులు కూడా అమెకు మద్దతునిస్తున్నారు. భర్త కోసం మతధర్మాని తప్పి వివాహం చేసుకన్నా.. తన భర్త మాత్రం మాటకు కట్టుబడటం లేదని న్యాయస్థానాన్ని అశ్రయించి విడాకులు కోరింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే జైన మతానికి చెందిన రీమా అనే యువ‌తి తల్లిదండ్రులతో కలసి నివాసముంటుంది. బీహార్‌కు చెందిన కరణ్‌ తమ నివాసం వద్ద వృత్తి రీత్యా కంప్యూటర్ ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. వీరిద్దరి మ‌ధ్య పరిచ‌యం ఏర్ప‌డి అది కాస్తా క్రమంగా ప్రణయంగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువతి తల్లిదండ్రులు వద్దని తొలుత వారించినా.. తరువాత ఒకే కూతురు కావడంతో అంగీకరించక తప్పలేదు. అయితే కరణ్ తమ మతానుచారం మాంసాహారాన్ని తిననని, శాఖాహారిగా మారిపోతానని మాటఇచ్చాడని యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో వారు పెళ్లి చేశారు.

అయితే భర్త ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోకుండా  అప్పుడప్పుడు బయటకు వెళ్లి చికెన్ తిని ఇంటికి వచ్చేవాడు. ఈ విషయంలో రీమా, కరణ్ పలుమార్లు గొడవ ప‌డుతూ ఉండేవారు. వారిద్ద‌రి దాంప‌త్యానికి చిహ్నంగా కవల పిల్లలు కూడా పుట్టారు. అయితే, కరణ్ ఈ మ‌ధ్య అధికంగా మాంసాహారం తినేస్తున్నాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గోడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్తాయికి చేరడంతో ఇక భర్తతో వేగలేనని తనకు విడాకులు కావాలని కోరుతూ రీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rima Doshi  Jain community  vegetarian  Karan Chandela  Sola Bhagwat  Rajput  Bihar  

Other Articles