ములాయం ‘పవర్’ దొంగతనం ఎంతలా ఉందంటే... | Mulayam has electricity bill worth Rs. 4 lakh.

Mulayam singh electricity theft busted

Mulayam Singh Electricity, Mulayam Singh Power Bill, Mulayam Singh Yadav, Mulayam Etawah House, Mulayam Power Theft, Mulayam Yogi Adithyanath, Mulayam Unpaid Bill

Surprise inspection at Mulayam Singh Yadav's residence reveals unpaid electricity bill of Rs 4 lakh. Yogi Adityanath orders to clear unpaid electricity bill by month end.

ములాయంకు ‘పవర్’ షాక్ తగిలింది

Posted: 04/21/2017 10:32 AM IST
Mulayam singh electricity theft busted

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారీ విక్టరీ యూపీలో బీజేపీ పాగా వేయగా, అవమానకర రీతిలో సమాజ్ వాదీ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. అటు పై సీఎం కుర్చీ ఎక్కిన యోగి ఆదిత్యానాథ్ ‘గుండా గిరి’ ఇక సాగబోదంటూ పరోక్షంగా ములాయం, అఖిలేష్ లతోపాటు మిగతా పార్టీలకు వార్నింగ్ సంకేతాలు కూడా పంపాడు. అవినీతి అంతు చూసేందుకు నిర్ణయాలు తీసుకోవటం, వాటిని చకచకా అమలుపరుస్తూ చూపించే దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అధికారం నుంచి దిగిపోయాక ములాయం పరిస్థితి అస్సలు బాగోలేదు. అఖిలేష్ స్వతంత్ర్య నిర్ణయాల వ్యవహారశైలి ఇప్పటిదాకా పార్టీని డ్యామేజ్ చేస్తుండగా, తాజాగా మరో వ్యవహారం ఆయనకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఆయన ఇంట్లో జరిగిన ఓ చిన్న అగ్రిప్రమాదం పెద్ద గుట్టును బయటపెట్టేసింది. అక్రమంగా విద్యుత్ ను వాడుకోవటంతోపాటు, 4 లక్షల బకాయిలు ఉన్నట్లు తేలటం చర్చనీయాంశంగా మారింది. ఎటావాలోని సివిల్ లైన్స్ ఏరియాలో ములాయం ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. డజన్ల కొద్ది గదులు, సెంట్రలైజ్డ్ ఏసీ ఇల్లు, టెంపరేచర్ కంట్రోల్ లగ్జరీ స్విమింగ్ పూల్ ఇలా ఆ చుట్టుపక్కల ఇదే కాస్ట్ లీ బంగళా.

గురువారం ఆ ఇంట్లో ఓ చిన్న అగ్నిప్రమాదం జరగటంతో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బంది పవర్ కనెక్షన్‌లో తేడాను గమనించారు. అధికారికంగా 5 కిలోవాట్లకు తీసుకుని, ఆ స్థానే 40 కిలోవాట్ల కనెక్షన్ ను వాడుకుంటున్నారు. ఇది చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఉన్నతాధికారులకు తెలియజేసిన అనంతరం కనెక్షన్‌ను 40 కిలోవాట్లకు మార్చారు. అలాగే ములాయంసింగ్ యాదవ్ రూ.4 లక్షలకు పైగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు గుర్తించి, ఈ నెలాఖరు వరకు ఆయనకు గడువిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mulayam Singh Yadav  Etawah House  Electricity Bill  

Other Articles

 • Dancers arrested in east godavari for obscene dances

  యువకుల నడుమ.. అర్థనగ్న నృత్యాలు..

  Jan 18 | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. అయితే ఇంకా పలు ప్రాంతాల్లోని యువత మాత్రం ఈ సంబరాల జోష్ నుంచి పక్కకు తప్పుకోలేకపోతుంది. దీంతో యువతను అట్రాక్ట్ చేసేందుకు కొందరు... Read more

 • Mothkupalli narsimhulu sensational comments on tdp

  టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయండీ: మోత్కుపల్లి

  Jan 18 | తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధిష్టానంపై గత కొంత కాలంగా ముభావంగానే వుంటూ వస్తున్నారు. గవర్నర్ పదవి నేపథ్యంలో ఊహాత్మక మౌనాన్ని వహించి.. అటు అధికారపక్షంపై కానీ... Read more

 • India today opinion poll says rajinikanth party gets 33 seats

  రజనీకాంత్ రాణించలేడా..? సర్వే తేల్చిన నిజం..!

  Jan 18 | తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు దేశంలోనే ప్రముఖ నటులుగా ఖ్యాతిని సొంత చేసుకున్న... Read more

 • Leonia resorts managing director arrested in bad debts case

  బ్యాంకులకు శఠగోపం.. లియోనియా రిసార్ట్స్ ఎండీ అరెస్ట్

  Jan 18 | బ్యాంకులకు వేల కోట్ల రూపాయల శఠగోపం పెట్టి విదేశాలకు తరలివెళ్లిన కింగ్ ఫిషర్ గ్రూప్ సంస్థల అధినేత విజయ్ మాల్యా ఘటన వెలుగుచూసిన తరుణంలోనే ఇలాంటి మార్గంలోనే పయనిస్తున్న బడాబాబులు ఏకంగా వేల సంఖ్యలో... Read more

 • Telangana techie dies in miami after being hit by speeding truck

  అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు టెక్కీ దుర్మరణం

  Jan 18 | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. దక్షిణ ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన రోడ్డుప్రమాదంలో కరీంనగర్‌ జిల్లావాసి నరహరి భరత్ రెడ్డి(37) మృతి చెందాడు.... Read more

Today on Telugu Wishesh