Modi and paytm founder on time list

TIME Magazine, TIME Narendra Modi, TIME List Indians, Most Influential People List 2017, TIME 2017 List, TIME Indian Persons, TIME Modi Vijay Shekhar Sharma, Narendra Modi Paytm Head, Narendra Modi Vijay Shekhar Sharma

Prime Minister Narendra Modi, Paytm’s Vijay Shekhar Sharma in Time’s ‘most influential people’ list 2017.

పీఎంతోపాటు పేటీఎం చీఫ్ కూడా...

Posted: 04/21/2017 07:51 AM IST | Updated: 04/21/2017 08:01 AM IST
Modi and paytm founder on time list

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన పాపులారిటీతో మరో సత్తా చాటాడు. టైమ్ పత్రిక ప్రతి ఏటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తుల్లో మోదీ నిలిచారు. గురువారం ఈ మేరకు టైమ్ మాగ్జైన్ 2017 జాబితాను విడుదల చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మేనియా మూడేళ్ల తర్వాత కూడా ఏమాత్రం తగ్గలేదని టైమ్ ప‌త్రిక పేర్కొంది. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ పరంగా ఆక‌ట్టుకుంటూ అద్భుతమైన ప్రతిభ క‌న‌బ‌రుస్తున్నారని చెప్పింది. ఇక ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘనవిజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

భారత్ నుంచి మరో వ్యక్తి కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాడు. నోట్ల రద్దు తర్వాత బాగా వ్యాప్తిలోకి వచ్చిన పేటీఎం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఆయ‌న‌ ముందుండి నడిపిస్తున్నారని టైమ్ కొనియాడింది. ముఖ్యంగా గత నవంబర్ లో భారత ప్రభుత్వం అనూహ్య రీతిలో 86 శాతం ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసిందని, ఆ తర్వాత పరిస్థితులను విజయ్ సరిగ్గా వినియోగించుకున్నాడని ప్రశంసించింది. గ‌త ఏడాది ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లు ఉన్నార‌ని, సంవ‌త్స‌రం తిరిగే నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని పేర్కొంది. ఓ మారుమూల‌ పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో విద్యాభ్యాసం చేసిన విజ‌య్, డిజిటల్ ఎకానమీలో పై చేయి సాధించటం అద్భుత విజయమని కొనియాడింది. ప్రస్తుతం చైనా దిగ్గజ కంపెనీలై అలీబాబా, జాక్మా కంటే పేటీఎం వృద్ధి గణనీయంగా ఉందని తెలిపింది.

ఇక ఇదే జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా చోటు సంపాదించుకున్నారు. వారి శక్తి సామర్థాలు, మేధస్సు, వారి సాధించిన విజయాలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టైమ్స్ ఈ జాబితాను ప్రతీ యేడూ విడుదల చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TIME List 2017  Narendra Modi  Paytm  Vijay Shekhar Sharma  

Other Articles

 • Cop arrested for aiding prostitution racket

  సీక్రెట్ సెక్స్ రాకెట్.. షాకింగ్ నిజాలు

  Apr 24 | బెంగళూరు నిన్న బయటపడిన ఓ హైటెక్ సెక్స్ రాకెట్ వెనుక షాకింగ్ వ్యవహారాలు వెలుగు చూశాయి. ఖాకీ డ్రెస్సు అండతో కక్కుర్తి పనులకు దిగిన ఓ కానిస్టేబుల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని... Read more

 • Cow vigilante attack family in jammu

  ITEMVIDEOS:నెట్ లో కశ్మీర్ సంచలన వీడియో

  Apr 24 | గోరక్షక దళాల పేరిట దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జమ్ములో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియో భయానకంగా ఉంది. రియాసీ జిల్లాలో ఓ కుటుంబంపై నినాదాలు చేస్తూ మరీ దూసుకొచ్చిన ఓ గ్రూప్ దాడికి... Read more

 • Murder at jayalalithaa kodanad tea estate

  అమ్మ ఎస్టేట్ లో హత్య.. భారీ దోపిడి?

  Apr 24 | తమిళనాడులో మరో కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఊటీలోని టీ ఎస్టేట్ లో హత్య జరిగింది. శివారులో ఉన్న 'కొడనాడ్' ఎస్టేట్ వాచ్ మెన్ ను హత్య చేయటంతోపాటు కీలక పత్రాలను కాల్చివేసినట్లు... Read more

 • Bride melody performance at her wedding

  ITEMVIDEOS: పెళ్లిలో ఇలాంటి స్టెప్పులు కూడానా?

  Apr 24 | సాంప్రదాయకమైన వివాహ వేడుకలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఖరీదైన బట్టలు, విందు భోజనాలు, బంధు మిత్రుల కోలాహలం ఇది తప్పదు. ఈ మధ్య దీనికి భారీ తనం అనే కొత్త హంగు వచ్చిపడటంతో కోట్ల... Read more

 • Bjp poised to sweep delhi municipal election

  ఎగ్జిట్ పోల్ జోస్యం: మళ్లీ బీజేపీదే గెలుపు

  Apr 24 | వరుస రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో విజయం పడేలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ ను... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno