టోల్ బూత్ సిబ్బంది చెంపచెల్లుమనిపించిన బీజేపి ఎమ్మెల్యే BJP MLA slaps toll plaza employee in Uttar Pradesh

Furious at 10 second wait bjp lawmaker in up slaps toll booth staff

uttar pradesh, Sitapur, Rakesh Rathore, BJP MLA, Toll plaza, toll booth employee, VIP culture, red beacons, india news, politics

A BJP lawmaker in Uttar Pradesh furious at having to wait at a toll booth is seen slapping an employee in visuals caught on CCTV and posted on social media.

ITEMVIDEOS: టోల్ బూత్ సిబ్బంది చెంప చెల్లుమనిపించిన బీజేపి ఎమ్మెల్యే

Posted: 04/20/2017 06:34 PM IST
Furious at 10 second wait bjp lawmaker in up slaps toll booth staff

ఎర్రబుగ్గల సంస్కృతికి స్వప్తి పలుకుతూ.. ఇకపై భారతీయులందరూ వీవీఐపీలేనని ప్రధాని మోడీ ప్రకటించగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం అధికార దర్పాన్ని వీడటం లేదు. అధికారముందన్న అహకారంతో వారు సర్థి చెప్పితే పోయే విషయాలను కూడా తమ అధికార దర్పాన్ని వినియోగించి వారిపై చేతులు చేసుకుంటూ గుండారాజ్యం తలపించేలా వ్యవహరిస్తూ అటు పార్టీ పరువుతో పాటు ఇటు స్వతహాగా తమంతతాము పరువుకు భంగం కల్గించుకుంటున్నారు. ఇందుకు ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రకేస్ రాథోర్ నిలువెత్తు నిదర్శనం.

స్థానికంగా ఓ టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే కారును పోనిచ్చిన టోల్ సిబ్బంది.. ఆ తరువాత ఆయన అనుచరులకు సంబంధించిన కారును వెళ్లినీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది ఇది కూడా ఎమ్మెల్యే కారేనని చెప్పినా వారు అనుమతించలేదు. పది సెకన్ల సమయం దాటినా ఆ కారును ఇంకా అనుమతించకపోవడంతో.. ఇక ఎమ్మెల్యే రాకేష్ రాథోర్ రంగంలోకి దిగి అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. అంతేకాకుండా వాహనాలు వెళ్లకుండా అడ్డగా వుండే కర్రను కూడా జరిపి సదరు సిబ్బందిపై వెళ్లారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగుతీశారు.

ఈ మొత్తం ఘటన టోల్ ప్లాజాలో వుంటే సిసీటీవీల్లో నిక్షిప్తమైంది. దీంతో వీటిని అక్కడున్నవారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అవి కాస్తా వైరల్ అయ్యారు. అధికార బీజేపి ఎమ్మల్యే దౌర్జన్యం అంటూ నెట్ జనులు కామెంట్లు కూడా పెట్టారు. ఆ నోటా ఈ నోటా విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేష్ రాథోర్ మాత్రం తాను టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారన్న వార్తలను అయన తోసిపుచ్చారు. తన కారును ఎందుకు అనుమతించడం లేదని తాను సిబ్బందిని నిలదీసిన విషయాన్ని అంగీకరించిన ఆయన కోట్టినట్లు వార్తలు రావడం మాత్రం తప్పని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్.. మహిళలతో పాటు రాష్ట్ర పౌరులకు కూడా ఎలాంటి విఘాతం కల్గించకుండా చర్యలు తీసుకోవాని కోరుతున్నారు. ఇటు గుండారాజ్ ను భూస్థాపితం చేయడంతో పాటు పార్టీలో శాసనసభ్యులుగా కోనసాగుతూ అధికారముందని దాడులకు తెగబడుతున్న వారిని కూడా నియంత్రించాల్సిన అవసరముందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles