మోదీకి గిరిజనుల ఆఫర్.. కశ్మీర్ అల్లర్లను ఆపే ఆయుధాలు అవేనా? | Gofan battalion better choice for Kashmir stone pelters.

Bhil youth open letter to pm modi

Madhya Pradesh Bhil Tribals, Tribals Letter Modi, Gofan Battalion, Kashmir Stone Pelters, Modi Bhil Youth, Tribal Youth Offer Modi, Kashmir Madhya Pradesh, MP Tribals Gofan Battalion, Gofan Batch Kashmir

‘Patriotic’ Madhya Pradesh Bhil Tribals offer to take on Kashmir stone pelters with traditional slingshot.

మోదీజీ... ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్

Posted: 04/20/2017 03:18 PM IST
Bhil youth open letter to pm modi

కశ్మీర్ లో అల్లకల్లోలాలు దేశం మొత్తాన్ని కదిలించి వేస్తున్నాయి. నెలల తరబడి కొనసాగుతున్న అల్లర్లు ఈ మధ్య మళ్లీ తారా స్థాయికి చేరిపోవటం తెలిసిందే. జవాన్లు పరిస్థితి అదుపులోకి తచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాళ్లు దాడులతో యువకులు విరుచుకుపడుతున్నారు. అయితే దేశం కోసం రక్షణగా నిలిచేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టే జవాన్ల పైనా జరుగుతున్న అరాచకాలను తట్టుకోలేని ఓ ప్రాంత ప్రజలు మాత్రం ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ఓపెన్ లెటర్ రాశారు.

కశ్మీర్ లో సైనికులపై రాళ్ల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో చూసి మనసు రగిలిన కొందరు యువకులు‘‘ పీఎం సాబ్... ప్లీజ్... మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, వాళ్లు మళ్లీ రాళ్లుముట్టకుండా చేస్తామంటూ’’ విజ్నప్తి చేస్తున్నారు. వీరంతా మధ్యప్రదేశ్ లోని జాబువా ప్రాంతానికి చెందిన భిల్ తెగ యువకులు. వాళ్లకు తమ ఒడిసెలను సమాధానం చెబుతామంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

‘‘మేం దేశభక్తులం. మా రక్తం ఉడుకుతోంది. దేశ రక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులపై రాళ్ల దాడులా?...సైనికులు సహనంతో చేతిలో ఆయుధాలున్నా? మౌనంగా భరించడమా? .ప్రధాని గారూ! మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కశ్మీర్ లో అల్లర్లు జరిగినప్పుడు రాళ్లు విసిరే యువకులకు ఎదురుగా మమ్మల్ని నిలబెట్టండి, మాకు ఆయుధాలు వద్దు.. వాళ్లు విసిరే రాళ్లే మాకు చాలు... మరోసారి కశ్మీరీ యువకులు రాళ్లు ముట్టుకుంటే ఒట్టు అంటూ గిరిజనులు అందులో పేర్కొన్నారు.

ఎవరీ భిల్లులు..

మధ్యప్రదేశ్ లోనే అత్యంత వెనకబడ్డ తెగ ప్రజలే ఈ భిల్లులు. అత్యంత పేద జిల్లా గా పేరున్న బహదూర్ హటిలలో వీళ్లు ఎక్కువగా ఉన్నారు. దేశంలోనే అక్షరాస్యతలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఈ ప్రాంతం ఉండగా, దాని చుట్టుపక్కల ఈ గిరిజన ప్రజలు వ్యవసాయం, కూలీ పనుల మీదే ఎక్కువ ఆధారపడి జీవిస్తుంటారు. పంట పొలాలపై దాడి చేసే పక్షులను, జంతువులను తరిమి కొట్టడంతోపాటు వేటకు సంబంధించి ఈ ఒడిసెలనే ఒడుపుగా వాడటంలో వీళ్లు సిద్ధహస్తులు. ఒక్కో యువకుడు 50 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఒడిసెలతో గురితప్పకుండా ఛేదించగలరు. మాములు మనిషి ఒక రాయిని విసిరే దూరంకు రెండు, మూడు రెట్ల దూరం, అత్యంత వేగంతో వీళ్ల ఒడిసెల నుంచి రాళ్లు దూసుకెళ్తాయి. అవి ఎంత డేంజర్ అంటే ప్రాణాలు పోయేంతగా...

తాంతియా బిల్ నేతృత్వంలో అప్పుడు బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడం, అవసరమైతే ఇప్పుడు కశ్మీర్ దుష్టశక్తులతో పోరాడేందుకు సిద్ధం అంటూ ప్రకటిస్తున్నారు. కశ్మీర్ దుష్టశక్తులను ఎదుర్కోవాలంటే మాలాంటి ఒడిసెల దళమే బెటర్ ఛాయిస్ అని, అవసరమైతే సైనికులకు కూడా అందులో శిక్షణ ఇస్తామని ప్రధాని తరపున కలెక్టర్ కు సమర్పించిన లేఖలో వారు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Bhil Tribal  Kashmir Chaos  Gofan Battalion  

Other Articles

 • Kings xi punjab and delhi pacer parvinder awana assaulted in noida

  నోయిడాలో క్రికెటర్ పై దాడి.. కారు ధ్వంసం

  Jul 22 | దేశంలో క్రీడాకారులకు భద్రత కరువైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కతాలో టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీపై కొందరు అగంతకులు జరిపిన దాడిని మర్చిపోకముందే. మరో  క్రికెటర్ పర్వీందర్ అవానపై గ్రేటర్‌ నోయిడాలో దాడి... Read more

 • Pmvvy new 8 pension scheme for senior citizens

  వయోవృధ్దులకు కేంద్రం కొత్త పెన్షన్ పథకం..

  Jul 22 | వయోవృద్ధులకు కేంద్రం వందనం చేస్తుంది. అవునండీ నిజంగా.. జీవిత చరమాంకంలో వారు అర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా వుండేందుకు వయో వందన పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ప్రవేవపెట్టింది.... Read more

 • Indian army s ammunition stock will exhaust after 10 days of war cag report

  ఆందోళన రేపుతున్న కాగ్ నివేదిక.. యుద్దం వస్తే..

  Jul 22 | కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ‌(కాగ్‌) తాజాగా వెలువరించిన విషయాలు దేశ ప్రజల్లో అందోళనను రేకెతిస్తుంది. ఓ వైపు పోరుగుదేశం తన ఆర్మీని సమాయత్తం చేస్తూ సరిహద్దులో పొంచివుండి యుద్దం తప్పదన్న సంకేతాలను జారీ... Read more

 • Nasa eyes solar eclipse to understand earth s energy system

  మిట్టమధ్యాహ్నం.. కారుచీకట్లు.. ఖగోళ అద్భుతం..

  Jul 22 | యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం అది. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా వాసులు పనిగట్టుకుని ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇది నిజంగా ఖగోళ అద్భుతం. ఈ అద్బుతాన్ని వీక్షించేందుకు అగస్టు... Read more

 • Six telcos understated revenues by rs 61 000 crore cag

  ఎయిర్ టెల్, ఐడియా సహా 6 కంపెనీలు కలసి ఇలా..

  Jul 22 | కలసి వుంటే కలదు సుఖం అన్నారు కానీ కలసి దోచుకోమ్మని ఎవరూ చెప్పరు. అయితే దొంగలు దొంగలు కలసి ఊళ్లను పంచుకున్నట్లు.. టెలికాం కంపెనీలు అన్ని కలసికట్టుగా ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెట్టాయని.. తాజా... Read more

Today on Telugu Wishesh

porno