Thambidurai backs palaniswamy as tn cm meets governor vidyasagar rao

palanisamy, panneer selvam, shasikala, aiadmk, AIADMK Amma, AIADMK General Secretary, Thambidurai, Vidyasagar Rao, Jayalalithaa, PoliticalPlay, Tamilnadu

AIADMK leader M Thambidurai meets Tamil Nadu governor C Vidyasagar Rao, who has been batting for EPS to continue as the state's chief minister despite the merger talks.

సీఎంగా పళనిస్వామే.. రాజ్ భవన్ లో తమిళనాట రాజకీయం..

Posted: 04/20/2017 12:53 PM IST
Thambidurai backs palaniswamy as tn cm meets governor vidyasagar rao

తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అకస్మిక మరణంతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తమకు అనుగూణంగా మర్చుకోవడంలో బీజేపి పావులు కదుపుతుంది. గోల్డన్ బీచ్ రిస్టార్ట్ లో రాజకీయాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్న చిన్నమ్మ శశికళను కటకటాల వెనక్కి పంపి.. ఇక పార్టీపై తమ అధిపత్యం చెలాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది. చివరాఖురున తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సి.విద్యాసాగర్ రావును కూడా రంగప్రవేశం చేయించి అయనతో పావులు కదలిస్తోంది.

ఈ క్రమంలో తమిళనాడులో అధికార మార్పిడి చోటుచేసుకుంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. పళనిస్వామికి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వనున్నారని.. ఆయనతో పాటు పలువురు కీలక నేతలకు రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా బీజేపి ఇప్పటికే సమ్మతి తెలిపిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వానికే పగ్గాలు అందనున్నాయన్న ప్రచారం జోరందుకుంది. తమకు అనుకూలురైన పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠంపై వుంటేనే తాము అనుకున్నట్లుగా అటలు అడించవచ్చని బీజేపి భావిస్తుంది.

తమిళనాడులో తమ సత్తాను గత ఎన్నికలలో చాటాలని భావించి ఘోరంగా విఫలమైన బీజేపి.. కేంద్రంలో అధికారంలో వున్నడం.. తమ అధీనంలో వున్న అన్ని శాఖలను ప్రయోగించి.. జయలలిత మరణం తరువాత కలసివచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ తమ అధిపత్యాన్ని చెలాయించేందుకు రెడీ అయ్యింది. మరోలా చెప్పాలంటే అక్కడ వున్నది అన్నాడీఎంకే ప్రభుత్వమే అయినా.. పాలన సాగించేది మాత్రం బీజేపినే అన్నట్లుగా పూర్తిగా మార్చేసింది. ఇందులో భాగంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చెలిమి కుదర్చడంలో బీజేపీ వేసిన స్కెచ్ దాదాపు ఫలప్రదమైందని తెలుస్తోంది.

జయలలిత తరువాత తమకు నమ్మినబంటుగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రయత్నాలను అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై విభేదిస్తున్నారు. ప్రస్తుత సీఎం పళనిస్వామినే ముఖ్యమంత్రిగా కోనసాగించాలని ఆయన చక్రం తిప్పుతున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో పన్నీరు సెల్వానికి చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాజ్ భవన్ లో భేటీ అయ్యి చర్చించారు. రాజ్ భవన్ కు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన తంబిదురై తమిళనాడు సీఎంగా పళనిస్వామి కొనసాగుతారని అన్నారు. మరి అధికార మార్పిడిపై వస్తున్న ఊహాగానాలకు ఎప్పుడు చెక్ పడుతుందో.. ఎలా పడుతుందో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : palaniswamy  panneer selvam  Thambidurai  Vidyasagar Rao  aiadmk  Tamilnadu  

Other Articles

 • Cop arrested for aiding prostitution racket

  సీక్రెట్ సెక్స్ రాకెట్.. షాకింగ్ నిజాలు

  Apr 24 | బెంగళూరు నిన్న బయటపడిన ఓ హైటెక్ సెక్స్ రాకెట్ వెనుక షాకింగ్ వ్యవహారాలు వెలుగు చూశాయి. ఖాకీ డ్రెస్సు అండతో కక్కుర్తి పనులకు దిగిన ఓ కానిస్టేబుల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని... Read more

 • Cow vigilante attack family in jammu

  ITEMVIDEOS:నెట్ లో కశ్మీర్ సంచలన వీడియో

  Apr 24 | గోరక్షక దళాల పేరిట దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జమ్ములో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియో భయానకంగా ఉంది. రియాసీ జిల్లాలో ఓ కుటుంబంపై నినాదాలు చేస్తూ మరీ దూసుకొచ్చిన ఓ గ్రూప్ దాడికి... Read more

 • Murder at jayalalithaa kodanad tea estate

  అమ్మ ఎస్టేట్ లో హత్య.. భారీ దోపిడి?

  Apr 24 | తమిళనాడులో మరో కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఊటీలోని టీ ఎస్టేట్ లో హత్య జరిగింది. శివారులో ఉన్న 'కొడనాడ్' ఎస్టేట్ వాచ్ మెన్ ను హత్య చేయటంతోపాటు కీలక పత్రాలను కాల్చివేసినట్లు... Read more

 • Bride melody performance at her wedding

  ITEMVIDEOS: పెళ్లిలో ఇలాంటి స్టెప్పులు కూడానా?

  Apr 24 | సాంప్రదాయకమైన వివాహ వేడుకలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఖరీదైన బట్టలు, విందు భోజనాలు, బంధు మిత్రుల కోలాహలం ఇది తప్పదు. ఈ మధ్య దీనికి భారీ తనం అనే కొత్త హంగు వచ్చిపడటంతో కోట్ల... Read more

 • Bjp poised to sweep delhi municipal election

  ఎగ్జిట్ పోల్ జోస్యం: మళ్లీ బీజేపీదే గెలుపు

  Apr 24 | వరుస రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో విజయం పడేలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ ను... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno