డామిడ్.. కథ అడ్డం తిప్పేస్తారా..? another twist for samantha to continue as telangana handloom brand ambassador

Another twist for samantha to continue as telangana handloom brand ambassador

samantah, handloom sector, KTR, brand ambassador, telangana, tollywood, Telangana handlooms, Samantha Brand Ambassador, Telangana Handloom ministry, telangana handloom samantha no official agreement,Samantha Telangana, Samantha Face of Telangana Hand looms, Samantha KTR, Telugu

tollywood actress samantha has faces a twist yesterday from handloom sector, yet she faces another twist to continue as telangana handloom ambassador today.

చేనేత అంబాసిడర్.. సమంత స్టోరీ మారింది..!

Posted: 04/20/2017 12:03 PM IST
Another twist for samantha to continue as telangana handloom brand ambassador

తెలంగాణ చేనేతకు మంచి రోజులు వచ్చాయని నేతన్నలు బావిస్తున్న క్రమంలో అటు యువతలో మంచి ఫాలోయింగ్ వున్న సినీనటి సమంతతో పాటు.. ఇటు సినిమాలలో బిజీగా కొనసాగుతూనే తన రాజకీయ పార్టీని కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న జనసేనాని పవన్ కల్యాన్ లు తమ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించడంతో నేతన్నలు సంబరపడుతున్నారు. అదే వారి సంబరం ఎంతో పేపు నిలవలేదు. తెలంగాణ చేనతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీనటి సమంత సేవలను వినియోగించుకుంటామని గతంలో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. నిన్న అధికారికంగా అమె తెలంగాణ చేనేతకు అంబాసిడర్ కాదు అని స్పష్టం చేయాగా.. ఇవాళ టెస్కో శాఖ మరో ట్విస్టు ఇచ్చింది.

సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన నేపథ్యంలో అమె నియామకపు వివరాలను వెల్లడించాలంటూ చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు అర్టీఐ కింద వివరాలు కోరగా.. ప్రభుత్వం అమె బ్రాండ్ అంబాసిడర్ కాదని, అమెతో ప్రభుత్వం ఎలాంటి అధికారక ఒప్పందాలు చేసుకోలేదని బదులిచ్చిన ప్రభుత్వం.. 24 గంటలు కూడా తిరగక్కుండానే మాట మార్చింది. సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడరేనని చెప్పింది. ఈ మేరకు టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యార్ ఓ ప్రకటనలో పేర్కోన్నారు.

త్వరలోనే సమంతతో తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంశానికి సంబంధించి అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. చేనేతరంగ అభివృద్ధికి, చేనేత వస్త్రా‌లపై ప్రచారం చేయడానికి అమె స్వచ్ఛందంగా ముందుకొచ్చారని.. నేతన్నల పట్ల అమెకున్న అదరణతోనే అమెను మంత్రి కేటీఆర్‌ చేనేతకు అంబాసిడర్‌గా గుర్తించి గౌరవించారని తెలిపారు. ఆమె సేవలను సంతోషంగా వినియోగించు కుంటామని చెప్పారు. ఇప్పటికే సమంత ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రచారం చేస్తున్నారని... పలు చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను, ప్రాంతాలను కూడా సందర్శించారని ప్రకటనలో పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantah  handloom sector  KTR  brand ambassador  telangana  tollywood  

Other Articles

Today on Telugu Wishesh