అదివారం పెట్రోల్ బంకుల సెలవులో కొత్త ట్విస్ట్.! Shutting fuel stations on Sundays gets a thumbs down

Shutting fuel stations on sundays gets a thumbs down

petrol pumps, Hindustan Petroleum, Indian oil, Bharat petroleum, ECA, Dharmendra Pradhan, centre, Karnataka, Andhra Pradesh, Telangana, Tamil Nadu, Kerala, Puducherry.

The idea of shutting fuelling stations on Sundays is not a practical one. It will not help reduce consumption of fuel, as people will fill up on other days of the week.

అదివారం పెట్రోల్ బంకుల సెలవులో కొత్త ట్విస్ట్.!

Posted: 04/20/2017 11:16 AM IST
Shutting fuel stations on sundays gets a thumbs down

పెట్రోల్ బంకులకు అదివారం సెలవు దినంగా ప్రకటించే విషయంలో మరో ఊహించిన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తమ ప్రధమ డిమాండ్లు పరిష్కరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని పెట్రోబంకుల డీలర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే నెల 14 నుంచి దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు అదివారం మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సరికొత్తగా వచ్చిన ట్విస్ట్ నేపథ్యంలో పెట్రలు బంకుల డీలర్లు ముందుగా తమ ప్రధమ డిమాండ్లను కేంద్రం, చమురు సంస్థలు పరిష్కరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని తేల్చిచెప్పారు.

తమకు అందించే కమీషన్ ను ముందుగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న కమీషన్ కు బదులుగా పెట్రోలుపై లీటరుకు ఇస్తున్న రూ.2.56, డీజిల్‌పై ఇస్తున్న రూ.1.65 కమీషన్‌ను పెంచాలని డీలర్ల సంఘాలు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నాయి. డీలర్ల డిమాండ్‌పై వచ్చే నెల 10న కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించనుంది. దీంతో కేంద్రం ప్రకటించే కమీషన్ ను చూశాకే ఆదివారం సెలవు అమలుపై నిర్ణయం తీసుకుంటామని డీలర్ల సంఘాలు చెబుతున్నాయి.

అదివారం సెలవుపై అటు బంకులు యాజమాన్యాలతో పాటు ఇటు వాహనదారులు కూడా పెదవి విరుస్తున్నారు. నిత్యవసరాలు మారిన ఇంధనం సరఫారా చేసే బంకులకు సెలవు దినాలేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెట్రోలు బంకులు అదివారం సెలవులు ప్రకటించడంతో ప్రైవేటు బంకుల యాజమాన్యాలు ఈ నిబంధనను పాటించవని.. ఈ నిర్ణయంతో ప్రైవేటు యాజామాన్యాలకు లాభమే తప్ప.. ప్రభుత్వ బంకులు ఎలాంటి లబ్ది చేకూరదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

అదివారం పెట్రోలు బంకులు బంద్ చేయడం వల్ల శనివారం రోజునే వాహనదారులు తమ వాహనాలలో పెట్రోల్ కోట్టించుకుంటారని, దీంతో బ్లాక్ మార్కెట్ దారులు లబ్దిపోందే అవకాశాలే అధికమన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదివారం పూట అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. పెట్రోల్ బ్లాక్ మార్కెట్ లో ఖరీదు చేయాల్సి వస్తుందని, ఈ నిర్ణయంతో మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లు అవుతుందని చెప్పారు. పెట్రోలు వాడకాన్ని తగ్గించి ఇంధన వనరులను పరిరక్షించుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం పెట్రోలు బంకులు మూసివేయాలని నిర్ణయించుకున్న బంకు యాజమాన్యాలు.. ఈ నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే కేంద్రం తమ ప్రధమ డిమాండ్ ను పరిష్కరించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామని డీలర్ల సంఘం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol pumps  Hindustan Petroleum  Indian oil  Bharat petroleum  ECA  Dharmendra Pradhan  centre  

Other Articles

Today on Telugu Wishesh