జగన్ పై సోమిరెడ్డి జోక్ అదిరిపోయింది | Agriculture Minister saties on YS Jagan.

Somireddy slams jagan for two days dharna

Agriculture Minister Somireddy Chandramohan Reddy, Agriculture Minister, Somireddy YS Jagan, Jagan Somireddy, Jagan Agriculture Dharna, Jagan Somireddy, Jagan Rythu Dharna, Jagan Guntur Dharna, YS Jagan Fast, Jagan Hunger Strike, YS Jagan Protest

Agriculture Minister Somireddy Chandramohan Reddy slams YS Jagan for Former Protest. Jagan to stage dharna in Guntur on April 26, 27.

జగన్ దీక్ష సీక్రెట్ చెప్పేసిన సోమిరెడ్డి

Posted: 04/20/2017 11:13 AM IST
Somireddy slams jagan for two days dharna

ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి మరో దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ ఈ నెల 26, 27న గుంటూరులో దానిని చేయబోతున్నాడు. అయితే ఇది వరకు చేసిన దీక్షల ఫలితం ఎలాగుందో తెలిసికూడా జగన్ మళ్లీ ఇలా చేయటం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అయినా జనాల్లోకి బలంగా దూసుకెళ్లాలన్న, ప్రజా నేతగా ముద్ర వేసుకోవాలన్న ఇంతకు మించి మరో దారి లేదనే భావనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. తెలుగుదేశం ప్రభుత్వంకు వ్యతిరేకంగా జగన్ చేయబోతున్న దీక్షపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించాడు.

దీక్షల పేరుతో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్నాడని. కేవలం ఉనికిని చాటుకోవ‌డానికే తప్ప అవి ఎందుకు పనికిరావని సోమిరెడ్డి తేల్చేశాడు. త‌మ ప్ర‌భుత్వం స‌మ‌ర్థవంతంగా ప‌నిచేస్తున్నప్పటికీ జ‌గ‌న్ ఇలా దీక్ష‌ల పేరిట హడావుడి చేయటం సరికాదని చెబుతున్నాడు. ‘‘అప్పుడ‌ప్పుడు జ‌గ‌న్ ఇలా దీక్షలు చేయడానికి వెనకాల ఓ సీక్రెట్ రీజన్ ఉంది. నాలుగైదు నెల‌ల‌కొక‌సారి రెండురోజుల పాటు ఇలా ఉప‌వాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంద‌ని జ‌గ‌న్‌కి వైద్యులు సూచించారు. అందుకే అడపా దడపా ఇలా దీక్షలంటూ.. సోమిరెడ్డి ఎద్దేవా చేశాడు.

ఇక రాష్ట్రంలోని రైతుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్న మంత్రి అవసరమైన సూచనలు ఇవ్వకుండా ఇలా ఆందోళనలు చేపట్టడం సరికాదని జగన్ కు సూచించాడు. రాయ‌ల‌సీమ‌ అభివృద్ధి సమయంలో జ‌గ‌న్‌ ఇలాగే దీక్షకు దిగుతున్నాడా? అంటూ సోమిరెడ్డి చుర‌క‌లంటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister Somireddy  YS Jagan  Agriculture Dharna  

Other Articles

Today on Telugu Wishesh