పట్టుకోవటానికి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ కి చిరుత ‘హాయ్’ ఎలా చెప్పిందో చూడండి | Leopard strayed into a village attacked a forest ranger.

Leopard chases forest ranger off roof

Leopard, Leopard Attack Odisha, Leopard Chase Forest Ranger, Leopard Attack Indian Village, Balangir Leopard Attack, Leopard Attack Forest Ranger, Leopard Attack Video

Leopard runs amok in Odisha village, chases forest ranger off roof. A boy Milan Rana, and forest ranger Bijay Khuntia were attacked in Balangir(Bolangir) district in the state of Odisha. Another man, Satyajit Kundakel, suffered minor injuries when he jumped off the roof of a house in a bid to save himself from the marauding leopard.Finally officials were able to tranquillise it and lock it up in a cage.

ITEMVIDEOS: చుక్కలు చూపించిన చిరుత

Posted: 04/20/2017 08:49 AM IST
Leopard chases forest ranger off roof

ఎప్పుడూ అటవీలో ఉండటం మూలానో, లేక తమ మొహాలే చూసుకుని ఉండటం మూలానో... బోర్ కొట్టి పక్కనే ఉండే ఊళ్లలోకి అప్పడప్పుడూ విజిటింగ్ కు వెళ్తూ జనాలకు అలా హాయ్ చెప్పి వస్తుంటాయ్ కొన్ని జంతువులు. ఈ క్రమంలో వాటిని చూసి భయపడుతూనే వెంటపడే మనుషులు, రక్షణ కోసం మూగ జీవాల తాపత్రయం ఇలా ఆ కన్ఫ్యూజన్ లో ఒకరిపై ఒకరు దాడులు అనేవి సర్వసాధారణంగా మారిపోయింది.

ఒడిషా లో కూడా ఇప్పుడు ఇలాటి ఘటనే జరిగింది. బాలన్ గిర్ జిల్లాలోని ఓ ఊళ్లోకి ప్రవేశించిన చిరుత మొత్తం కలియ తిరుగుతూ జనాలకు చుక్కలు చూపించింది. అంతేనా తనను పట్టుకోవటానికి వచ్చిన అటవీ అధికారికి ఎలా హాయ్ చెప్పిందో ఇక్కడ చూడండి. 

 


ఓ పెంకుటిల్లుపై ఎక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి దానిని పట్టుకునేందుకు యత్నించాడు. వెంటనే ఎదురు దాడికి దిగిన చిరుత అతనిపైకి దూకేసింది. ఈ క్రమంలో ఆ ఇంటిపై నుంచి అతను గాల్లోకి దూకటం, అది కూడా అతనితో పాటే అమాంతం ఎగిరి గాయపరచటం జరిగిపోయాయి. ఇక తర్వాత ఇంకో ఇంట్లోకి దూరిన చిరుత ఇంటి పై కప్పును చీల్చుకుంటూ బయటకు దూకి జనాలను తరిమింది. జనాల వెంట పడుతూ ఉ* పోయించింది. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారితోపాటు ఓ చిన్నారి, ఓ యువకుడికి గాయాలయ్యాయి. 

చివరకు భారీ ఎత్తున్న ఫారెస్ట్ అధికారులు రంగ ప్రవేశం చేసి బోను సాయంతో చిరుతను బంధీ చేయగలిగారు. మొత్తం మీద యాక్షన్ సినిమాలకు తలపించేలా చిరుత చేసిన ఛేజ్ వీడియో నెట్ లో వైరల్ గా మారాయి. మొన్నామధ్యే గుజరాత్ లో ఓ బిజీ హైవేపై సింహాలు అడ్డంగా కూర్చుని బ్లాక్ చేసిన విషయం గుర్తుంది కదా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard Attack  Odiaha Village  Forest Ranger  

Other Articles

Today on Telugu Wishesh