ఓపీఎస్ కి చేసిన ఛాలెంజ్ గుర్తుందా? | Paneerselvam sucessfully completed challenge.

Panneerselvam successfully checkmate sasikala

O Panneerselvam, OPS Challenge, AIADMk Merge, Sasikala Checkmate, OPS first win, Paneerselvam First WIn, AIADMK Palaniswamy OPS, Palamiswamy Panneerselvam

AIADMK merge O Panneerselvam successfully checkmate Sasikala and Nephew Dinakaran. Panneerselvam calls Sasikala removal 'first win' after Dinakaran says won't fight 'what party wants'

సెల్వం చేసిన ఛాలెంజ్ గుర్తుందా?

Posted: 04/20/2017 08:24 AM IST
Panneerselvam successfully checkmate sasikala

అమ్మ మరణానంతరం శశికళ పగ్గాలు చేపట్టే టైంలో కూడా పక్కనే ఉండి కిక్కురుమనకుండా ఉండిపోయిన పన్నీర్ సెల్వం, తిరుగుబాటు ఎవరూ ఊహించలేనిదే. సమాధి సాక్షిగా ఓపీఎస్ నడిపిన హైడ్రామా తమిళ రాజకీయాల్లో చెరగని ముద్రను వేసి పడేసింది. ఆపై థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ సాగిన స్టోరీ చివరకు చిన్నమ్మ అరెస్ట్ తో చల్లబడింది. అయినప్పటికీ పార్టీ పై పట్టు కోల్పోకుండా అల్లుడు దినకరన్ ను అన్నాడీఎంకే లో కీలక బాధ్యతల్లో ఇరికించి మరీ చెరసాలను వెళ్లింది.

అయితే శశికళ వ్యవహారం, దినకరన్ తో తలనొప్పులు నచ్చని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాగైనా మన్నార్ గుడి మాఫియాను దూరం చేయాలని అదను కోసం ఎదురు చూడసాగారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక ప్రచార సందర్భంగా ఓటుకు నోటు, ఈసీ లంచం వ్యవహారం బయటపడటంతో ఈ ఛాన్స్ దక్కినట్లయ్యింది. అంతే అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబాన్ని బహిష్కరించడం, రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే మళ్లీ ఒక్కటి అయ్యేందుకు బీజం పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హుషారుగా ఉన్నాడు.

‘అమ్మ’ సమాధి సాక్షిగా వీలైనంత త్వరగా విలీనాన్ని పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాడు. తన వర్గం నేతలు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. తాను చేస్తున్న ధర్మయుద్ధంలో తొలి విజయం లభించిందని పేర్కొన్నారు. అమ్మ మరణం తర్వాత పార్టీని హస్తగతం చేసుకున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులను తరిమికొట్టేంత వరకు తన పోరాటం ఆగదని తిరుగుబాటు సందర్భంగా ప్రకటించానని గుర్తు చేసిన సెల్వం, అది నెరవేరిందని, తాను చేసిన ధర్మయుద్ధంలో తొలి విజయమని(టార్గెట్ ఇంకా ఏమైనా ఉందా?) పేర్కొన్నాడు.

తన లక్ష్యం నెరవేరిందని, ఇక విడిపోయిన రెండు వర్గాలు వీలైనంత త్వరగా ఏకతాటిపైకి వచ్చి పార్టీని బలోపేతం చేయటం, అమ్మ ఆశయాలను అనుగుణంగా పాలన కొనసాగించటం మిగిలిందని చెబుతున్నాడు. ఏది ఏమైనా ఇన్నాళ్లూ విమర్శించిన మంత్రులే ఆయనను విపరీతంగా పొగిడేస్తున్నారు. విశ్వాసానికి ఆయన ప్రతీక అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Paneerselvam  Sasikala Faction Removal  First Win  

Other Articles