బాబ్రీ-అద్వానీ ఇష్యూపై అసదుద్దీన్ రియాక్షన్ ఇది | Asaduddin on Advani involvement in Babri demolition.

Asaduddin owaisi respond on sc verdict on babri demolition

Asaduddin Owaisi, Hyderabad MP Asaduddin Owaisi, Owaisi Babri Demolition, Babri Demolition LK Advani, Advani Asaduddin Owaisi, BJP Leaders Babri Demolition, Gandhi Assassination Babri Demolition, Advani Conspirac, Babri BJP Conspiracy, Uma Bharathi Babri

AIMIM cheif, Hyderabad MP Asaduddin Owaisi said Demolition of Babri more serious than Gandhi's Assassination.

బాబ్రీ ఇష్యూ గాంధీ హత్య కంటే దారుణం

Posted: 04/20/2017 07:51 AM IST
Asaduddin owaisi respond on sc verdict on babri demolition

బాబ్రీ కేసులో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహార్ జోషి, ఉమాభారతి సహా పలువురు నేతలు కుట్రదారులుగా పేర్కొంటూ సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దేశానికి మాయని మచ్చగా మిగిలిన ఆ ఉదంతానికి బాధ్యులైన వాళ్లే ప్రభుత్వాన్ని ఇప్పుడు నడుపుతుండటం సిగ్గు చేటని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నాడు.

మహాత్మాగాంధీ హత్య కంటే బాబ్రీ మసీదు విధ్వంసం తీవ్రమైన నేరమని హైదరాబాద్ పేర్కొన్నాడు. గాంధీ హత్య కేసును రెండేళ్లలో పూర్తిచేశారని పేర్కొన్న ఒవైసీ 25 ఏళ్లు దగ్గర పడుతున్నా బాబ్రీ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటం శోచనీయమన్నాడు. బాబ్రీ మసీదు కూల్చివేత జాతి సిగ్గుపడాల్సిన అంశం, ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం స్పందించినందుకు సంతోషం అని తెలిపాడు.

కళ్యాణ్ సింగ్ కూడా ఈ కేసులో నిందితుడే కదా. గవర్నర్ గా ఉన్నాడన్న కారణంతో మోదీ ప్రభుత్వం ఆయన్ని కేసు నుంచి తప్పిస్తారా? లేక న్యాయానికి కట్టుబడి ఆయన్ను బోనులో నిలబెడతారా? నాకు అనుమానమే అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు కూడా. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితులు మంత్రి పదవులు అందుకోవడంపై విచారం వ్యక్తం చేసిన ఒవైసీ కొందరు పద్మవిభూషణ్‌లు కూడా అందుకున్నారని విమర్శించాడు.

ఇక బీజేపీ అగ్రనేతను మోదీ ప్రభుత్వం కావాలనే ఇరిక్కించిదన్న లాలూ వ్యాఖ్యలపై పార్టీ చీఫ్ అమిత్ షా స్పందించాడు. అద్వానీకి పార్టీ మద్ధతు పూర్తిగా ఉందని, ఆయన కోసం అవసరమైన సాయం అందిస్తామని షా ప్రకటించాడు. బాబ్రీ మసీదు ఘటనపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇందుకోసం పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అయోధ్య కోసం ఉరిశిక్షకైనా తాను సిద్ధమని ఆమె ప్రకటించారు.బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో కుట్రేమీ లేదని తెలిపిన ఆమె, అంతా బహిరంగంగానే జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నైతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  Supreme Court  Babri Demolition  Advani Conspiracy  

Other Articles