సిరియాపై క్షిపణి దాడులు.. హిల్లరీ సూచనల మేరకేనా..? US launches missile strike in Syria

Us launches missile strike in syria after hillary suggestion

USA air strikes, syrian air base, Hillary Clinton, Donald Trump, chemical weapons, U.S. warships, Tomahawk missiles, Syrian President, Bashar al-Assad Mediterranean Sea,

Hillary Clinton said she supported more aggressive action in Syria while she was secretary of state, and spoke out about what she believes the U.S. should do about the worsening crisis.

సిరియాపై అమెరికా క్షిఫణి దాడులు.. హిల్లరీ సూచనల మేరకేనా..?

Posted: 04/07/2017 01:11 PM IST
Us launches missile strike in syria after hillary suggestion

సిరియాలో వందలాది మంది ఆ ఆమాయక దేశపౌరులు నిషేధిత రసాయన అయుధాలకు బలై ప్రాణాలను కోల్పోతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం తగు చర్యలు చేపట్టింది. సిరియా అదేశ పౌరులపై విమానాల సాయంతో నిషిద్ద రసాయన అయుధాలతో దాడులకు పాల్పడతున్న క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అగ్రరాజ్యం.. ఇవాళ వేకువ జామునుంచే సిరియాపై క్షిఫణి దాడులతో విరుచుకు పడింది. దీంతో సిరియా పశ్చిమ ప్రాంతం యావత్తు బాంబులతో దద్దరిల్లుతుంది. మిస్సైల్స్ తో అల్లకల్లోలం అయ్యింది.

మెడిటేరియన్ సముద్రంలోని రెండు అమెరికా యుద్ద నౌకలు వరుసగా సిరియాలోని విమాన బేస్ లను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 60 క్షిపణులతో దాడి చేసింది. ఈ యుద్ధ నౌకల నుంచి తోమహాక్ మిస్సైల్స్ ప్రయోగం జరిగినట్లు అమెరికా ప్రకటించింది. సిరియాలోని హోమ్స్ నగరం ఎయిర్ బేస్ టార్గెట్ గా ఈ యుద్ధానికి దిగింది అమెరికా. ఎయిర్ బేస్ తో పాటు తిరుగుబాటుదారుల స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది అగ్రరాజ్యం. ఈ దాడుల్లో ఎంత మంది తిరుగుబాటుదారులు చనిపోయారు అనేది వెల్లడించలేదు.

సిరియా తిరుగుబాటుదారుల కెమికల్ వెపన్స్ దాడుల్లో వందలాది మంది అసువులు బాసిన 48 గంటల్లోనే అమెరికా రంగంలోకి దిగింది. రసాయన దాడిలో 100 మంది చనిపోయారు. 30 మంది చిన్నపిల్లలు ఉన్నారు. సిరియా ఉగ్రమూకల, తిరుగుబాటుదారుల పైచాచికత్వంపై ప్రపంచం మొత్తం నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే సిరియాకు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన అమెరికా.. వందల మంది ప్రాణాలను బలిగోన్న నేపథ్యంలో అకస్మికంగా అమెరికా దాడులకు దిగడం ఆశ్చర్యానికి గురి చేశాయి.

సిరియాలో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు సిరియాకు రష్యా, ఇరాన్ మద్దతు ఇస్తున్నాయి. నిషేధిత రసాయన అయుధాలను వినియోగించి.. అమాయకులు ప్రాణాలను బలిగొంటే చూస్తు ఊరుకోబోమని అగ్రరాజ్యం తేల్చిచెప్పింది. కాగా తమ దేశంపై అమెరికా క్షిఫణి దాడులను చేయడాన్ని అదేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తివ్రంగా ఖండించారు. ఇది తమ దేశంపై దాడిగా పేర్కొన్నారు. అసద్ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రయిల్ కూడా మద్దతు పలికింది.

ఇదలావుండగా, సిరియాలోని వైమానిక స్థావరం మీద అమెరికా దాడి చేయడాన్ని డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ సమర్థించారు. అయితే అమె చేసిన సూచనల మేరకు ఈ దాడులు కూడా జరిగాయన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు హిల్లరీ క్లింటన్ ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అసద్ అల్ బషర్ వైమానిక స్థావరాల మీద అమెరికా దాడి చేయాలని చెప్పారు. ఆ దేశంలో చాలావరకు పౌరుల మరణాలకు సిరియా వైమానిక దళమే కారణమని, అందువల్ల సిరియా అధ్యక్షుడి నియంత్రణలో ఉన్న మొత్తం అన్ని వైమానిక స్థావరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కాసేపటికే సిరియా వైమానిక స్థావరంపై తోమహాక్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడులపై స్పందించిన హిల్లరీ.. తాను మరింత దూకుడు దాడులను కోరుకున్నట్లు గా పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles