ప్యారడైజ్, మినర్వా ప్లేరు మాత్రమే వేరు.. నాణ్యత మాత్రం కరువు.. Nasty meat on Hyderabad plates

In a healthy move ghmc cracks the whip on hyderabad hotels

Hyderabad Restaurants Serving Unhygienic Food, Unhygienic Food, Eateries In Hyderabad, GHMC Seized Unhygienic Food, Eateries In Hyderabad, hotel managements, fine, stamped meat, Sagar Restaurant at Shapurnagar, Sohail Hotel at Nalgonda Crossroads, Sohail Hotel at Nalgonda Crossroads, Paradise hotel at IS Sadan, Drunk yard Shivani Restaurant and Bar at Gachibowli, Drunk yard Shivani Restaurant and Bar at Gachibowli, Drunk yard Shivani Restaurant and Bar at Gachibowli

About 80 per cent of city eateries have been serving unhygienic food. Major hotels, including Paradise, Astoria and others have been serving unchecked meat to its customers keeping public life at high risk.

హైదరాబాద్ హోటళ్లు.. అనారోగ్యానికి నిలయాలు..

Posted: 04/04/2017 10:51 AM IST
In a healthy move ghmc cracks the whip on hyderabad hotels

హైదరాబాద్ హోటళ్లు అనారోగ్యానికి నిలయాలుగా మారుతున్నాయి. ప్రజలకు మంచి అహరాన్ని వడ్డించాల్సిన హోటళ్లు, ఓ వైపు డబ్బులను లాగుతూనే.. వారికి అనారోగ్యకమైన అహారాన్ని అందిస్తున్నాయి. చిన్న స్థాయి హోటళ్ల నుంచి పేరొందిన పెద్ద చైన్ హోటళ్ల వరకు అన్ని కూడా అనారోగ్యాన్ని వ్యాప్తి చేసే కేంద్రాలుగానే మారుతున్నాయి. ఏ ఒక్క హోటళ్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. సరికదా.. క్వాలిటీలో తామే బెస్టు అంటూ కస్టమర్ల వద్ద నుంచి మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి.

ధమ్ బిర్యాని, చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ఇలా పేర్లు ఏవైనా వాటిని చూసి లోట్టలేస్తూ అక్కడే తిన్నా లేక వాటిని పార్శిల్ తీసుకుని మీ ఇంట్లో తిన్నా అనార్యోగం గ్యారంటీ. హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే ధమ్ బిర్యానీలో హోటళ్లు వినియోగించే మాంసం తినడానికి పనికిరానిదని.. పైపెచ్చు వీటిని సేవించడం వల్ల అనారోగ్యం బారిన పడటం తప్పదని తాజాగా పలు హోటళ్లపై దాడులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు తేల్చిచెబుతున్నారు.

జంతువుల ఆరోగ్యస్థితిని, వయసును పరిశీలించి.. అవి తినడానికి అర్హమైనవిగా గుర్తించి జీహెచ్‌ఎంసీ స్టాంపు వేసిన వాటినే వధించాలని ఇదివరకే ప్రకటించినా.. ఆ ఆదేశాలను పక్కనబెట్టి అనేక హోటళ్లు గుర్తంపు లేని వధశాలలోనే ముసలి, ముతక, మరీ లేత, అనారోగ్యం బారిన పడిన జంతువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. దీంతో నగరంలోని అనేక హోటళ్లపై దాడులు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని జరిమానాలు విధించాయి.

నాణ్యతా ప్రమానాలు పాటించని హోటళ్లలో అటు బార్ అండ్ రెస్టారెంట్లుతో పాటు ఇటు పేరు మోసిన హోటళ్లు కూడా వున్నాయి. మినర్వా గ్రాండ్, ప్యారడైజ్, అల్ షబా, సోహెల్ హోటల్, డ్రంక్ యార్డ్ శివాని రెస్టారెంట్ అండ్ బార్, అస్టోరియా, అన్ ఓహ్రీన్, సాగర్ రెస్టారెంట్ లు ప్రమాణాలు పాటించని కారణంగా వాటిపై దాడులు నిర్వహించిన అధికారులు పది నుంచి ఇరవై వేల వరకు జరిమానాలు విధించారు. ఈ మేర మొత్తం లక్ష 40 వేల రూపాయల వసూళ్లను రాబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad restaurants  paradise  astoria  minerva  unhygienic food  eatares  GHMC  

Other Articles