ఫిల్మ్ సిటీ పై కేసీఆర్ కు ఎందుకంత ప్రేమ? | KCR affection on Ramoji Rao and Film City.

Telangana govt sanction land to ramojifilm city

Telangana Tourism Department, KCR Ramoji Film City, Ramoji Film City Telangana Government, Ramoji Film City Land, KCR Ramoji Rao, KCR Ramoji Film City, CM KCR Film City

Telangana Chief Minister again shows his affection on Ramoji Rao. Government Sanctioned 295 Acres to Ramoji Film City through tourism department.

కేసీఆర్ ఎంతలా మారిపోయాడంటే...

Posted: 04/04/2017 10:45 AM IST
Telangana govt sanction land to ramojifilm city

అవసరాన్ని బట్టి అయితే తులనాడటం లేదంటే తలకెక్కించుకోవటం రాజకీయాల్లో పరిపాటైన విషయమే. ఘాటైన వ్యాఖ్యలతో దూకుడు చూపించే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా అందుకు మినహాయింపు కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర మీడియాపై అంతెత్తున ఎగిరి పడ్డ ఆయన తర్వాత వారితో మంచి సంబంధాలు కొనసాగించటం అవసరాన్ని బట్టే అని చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈనాడు గ్రూపుల అధినేత రామోజీ రావుతో మంచి రిలేషన్ కొనసాగించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఛాన్స్ దొరికినప్పుడల్లా మీడియా మొఘల్ ను ఆకాశానికి ఎత్తేయటం, పంక్షన్లలో పిచ్చాపాటి కబుర్లు ఇలా దోస్తీ బాగానే సాగిపోతూ వస్తోంది. అది చాలదన్నట్లు రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో గానీ, అసైన్డ్ భూములుగానీ లేవని, అందులో ప్రతి అంగుళం కూడా రామోజీ రావు కష్టపడి కొన్నదేనని ఆమధ్య ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అఫ్ కోర్స్ ఇదే కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫిల్మ్ సిటీనీ లక్ష నాగళ్లతో దున్నిస్తానని, అందులో మొదటి నాగలి తనదే అని చెప్పాడు కూడా.

కానీ, సీన్ మారింది. అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో దాని మరిపించే స్టూడియో ఒకటి కడతామని ప్రకటించిన ఆయన, తర్వాత ఆ ఊసే ఎత్తకుండా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా వరాల జల్లు కురిపించేశాడు కూడా. రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు 295 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చేసుకున్న దరఖాస్తుపై స్పందించిన టీ సర్కార ఈ మేరకు పర్యాటక అభివృద్ధి కింద ఈ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లిలో 250.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో 125.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో 295 ఎకరాలు కావాలంటూ ఫిల్మ్ సిటీ తన దరఖాస్తులో పేర్కొంది. అంతేకాదు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాటిని కొనేందుకు సిద్ధమని తెలిపింది. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం భూములను అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. అయితే కొన్ని సర్వే నంబర్ల భూమిలో కొండలు, గుట్టలు ఉండడంతో విభజించడం సాధ్యం కాదని, కాబట్టి మొత్తం 376 ఎకరాలను అప్పగిస్తామని పర్యాటక శాఖకు రెవెన్యూ అధికారులు రాశారు.

నాగన్‌పల్లిలో భూముల బేసిక్‌ విలువను ఎకరా రూ.4 లక్షలుగా నిర్ణయించగా.. రెవెన్యూ అధికారులు మార్కెట్‌ విలువ రూ.18 లక్షలుగా అంచనా వే శారు. అలాగే, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూముల బేసిక్‌ విలువ ఎకరా రూ.9లక్షలు కాగా.. మార్కెట్‌ విలువ రూ.20 లక్షలుగా అంచనా వేశారు. అసైన్‌దారులకు పరిహారం చెల్లించేందుకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.376.32 ఎకరాలకు రూ.37.63 కోట్లు అవసరమవుతాయన్న ప్రభుత్వం, పత్రికా ప్రకటనలకు రూ.15 లక్షలు, ఇతర ఖర్చుల కింద రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.37.9 కోట్లు డిపాజిట్‌ చేయాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Government  Ramoji Film City  Land Sanction  

Other Articles