కోర్టుల తరువాత సోంత పార్టీ నేతలు.. ట్రంప్ కు షాకిచ్చారు Trump defiant after healthcare bill pulled before vote

Trump defiant after healthcare bill pulled before vote

Donald Trump, US president, Obamacare, Barack Obama, Paul Ryan, Health Insurance, congress, set back for trump, health care, america

US President Donald Trump has suffered a major setback after his healthcare bill was withdrawn before a vote in Congress.

కోర్టుల తరువాత సోంత పార్టీ నేతలు.. ట్రంప్ కు షాకిచ్చారు

Posted: 03/25/2017 06:51 PM IST
Trump defiant after healthcare bill pulled before vote

అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లడవుతూనే వుంది. ఈ క్రమంలో ఆయనతో పాటు ఆయన ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటు సోంత పార్టీ రిపబ్లికన్ లో కుమ్ములాటలు కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడానికి కారణంగా మారింది. దీంతో కొత్త హెల్త్ కేర్  బిల్లు చట్ట సభల మొహం చూడకుండా పోయింది. బిల్లు మీద ఓటింగ్ జరిగితే అమోదం లభించదని ముందుగానే ఊహించిన ట్రంప్ ప్రభుత్వ వర్గాలు ముందుగానే అప్రమత్తమై దానిని సభలో ప్రవేశపట్టలేదు.

సోంత పార్టీలోనే ఈ హెల్త్ బిల్లుపై అభిప్రాయ బేధాలు వుండటంతో దానిని సభలో ప్రవేశపెట్టే ధైర్యం చేయని ట్రంప్ సర్కార్.. తమ లోసుగులను కప్పిపుచ్చుకునేందుకు అపఖ్యాతిని మొత్తం డెమొక్రటిక్ పార్టీపైనే వేసే ప్రయత్నం చేసింది. డెమొక్రటిక్ పార్టీ నేతల సపోర్ట్ లేకపోవడందువల్లనే బిల్లు ప్రవేశపెట్ట లేకపోయినట్టు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడం ఇందుకు నిదర్శనం. డెమొక్రాట్లు మాకు మద్దతు పలుకుతారని అనుకున్నామని. కానీ ఈ బిల్లు తమకు చాలా పాఠాలు నేర్పిందని ట్రంప్ అన్నారు.

ఇక అపార్టీ అధికార ప్రతినిధి రయాన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని భావించడం లేదని, నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. అయితే ఒబామా బిల్లుకు కాలం చెల్లుతున్నందున్న వారి మద్దతును అశించామన్నారు. అయితే వారి చర్యలు తమకు చాలా నిరాశ కలిగించిందని, దీంతో  పెద్ద పనులు చేయడం ఎంత క్లిష్టమో తెలిసిందని అన్నారు. బిల్లు గట్టెక్కడానికి కొన్ని ఓట్లు తక్కువ పడతాయని అనిపించి దానిని ప్రవేశపెట్టలేదని చెప్పారు.

ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల నుంచి ఎవరూ అమెరికాలోకి అడుగుపెట్టకుండా వారిపై నిషేదాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలు నిలిపేయడంతో తన మాట చెల్లుబాటు కాకా నిరాశపడిన ట్రంప్ కు.. ఇప్పుడు సొంత రిపబ్లికన్ పార్టీ వాళ్ళే షాకిచ్చారు. దీంతో ప్రస్తుతానికి ఒబామా కేర్ ఇన్సూరెన్స్ స్కీమ్ కొనసాగుతుండడంతో ట్రంప్ పూర్తిగా నిరాశలోకి జారుకున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఓబామాది చెత్త స్కీం అంటూ విమర్శించిన ట్రంప్ దాని స్థానంలో కొత్త బిల్లు తీసుకోస్తామని ఇచ్చిన ఎన్నికల హామీకి ప్రస్తతానికి బ్రేక్ పడినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles