ప్రేమ జంటలను ఉపేక్షిస్తున్న ముఖ్యమంత్రి యోగీ.. UP CM says not to harass love couples

Yogi adityanath backs anti romeo squads to make up safe for women

uttar pradesh, chief minister, yogi adityanath, anti romeo squads, gorakhpur, anti teasing squads, up cm yogi, cm yogi adityanath, love couples, dgp daljit chowdary

UP Chief Minister Yogi Adityanath has backed the decision to form anti-romeo squads and action against slaughterhouses in Uttar Pradesh.

ప్రేమ జంటలను ఉపేక్షిస్తున్న ముఖ్యమంత్రి యోగీ..

Posted: 03/25/2017 05:26 PM IST
Yogi adityanath backs anti romeo squads to make up safe for women

ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్‌ పై అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఆయన కాబోయే ప్రధానమంత్రి అంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏకంగా ప్రధాని మోడీకి చెక్ పెట్టేది కూడా అదిత్యనాథే నంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రధాని నరేంద్రమోడీ అభిమానులు కొంత ఇరుకున పడుతున్నారు. అయితే యోగి అదిత్యనాథ్ 2024 సంవత్సరంలో ప్రధాని అంటూ అయన అభిమానులు చేస్తున్న హంగామా నేపథ్యంలో మరో ఏడేళ్ల తరువాత విషయాన్ని ఇప్పుడే ఎందుకుంటూ కూడా సమర్ధించుకుంటున్నారు.

ఉత్తర్ ప్రదశే్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతబట్టిన తరువాత సీఎం హోదాలో యోగి అదిత్యనాథ్ తొలిసారి తన స్వస్థలం గోరఖ్ పూర్‌ రావడంతో ఆయన అభిమానుల సందోహం మిన్నంటింది. గోరఖ్‌పూర్‌ మొత్తం కాషాయవర్ణంగా మారింది. వేలాది మంది అభిమానులు ఆయన కోసం గోరఖ్ నాథ్ ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు '2024లో ప్రధానమంత్రి యోగి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ ఆకాంక్షను వారు ఇలా చాటుకున్నారు.

స్వచ్చహైన పాలన, పరిశ్రుభతలకు పెద్ద పీట వేసే, ఎలాంటి పరిస్థితుల్లో తన పాలన అపఖ్యాతి పాలు కాకుండా, పాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు యోగి. తన నియోజకవర్గంలో మంచి ప్రజాప్రతినిధిగా పేరుతెచ్చుకున్నారు. మోదీ లాగే యోగి కూడా శ్రమించే వ్యక్తి అని, అందుకనే అయన కాబోయే ప్రధాని అని పేర్కోంటున్నామని, తమ అకాంక్ష ఖచ్చితంగా నేరవేరుతుందని ఆయన అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాంటీ రోమియో స్క్వాడ్ లు మహిళలు, యువతుల పరిరక్షణ కోసమేనన్నారు. మహిళామూర్తులపై లైంగిక దాడులు వంటి ఘటనలను రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఈ స్క్వాడ్ లు దోహదం చేస్తామన్నారు. అయితే అంతకుముందు ఆయన ప్రేమజంటలకు, యువ జంటలకు మాత్రం మినహాయింపు కల్పించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

ముఖ్యంగా యువతులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాంటీ రోమియో స్క్వాడ్ లతో ఆకతాయిలకు చెక్‌ పెట్టే కార్యక్రమాన్ని అక్కడ అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో అమాయక యువత, జంటలు కూడా పోలీసుల వేధింపులకు గురవుతున్నారని తన దృష్టికి రావడంతో ఆయన ప్రేమ, యువ జంటలను మాత్రం వేధించకండీ అంటూ పోలీసులకు సూచించారు. దీంతో యువజంటలను, అమాయక యువతను వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తప్పవని శాంతిభద్రతల అదనపు డీజీ దల్జీత్‌ చౌదరి  హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles