మరో భారత సంతతి యువతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు White man shouts 'go back to Lebanon' to Sikh-American girl

White man shouts go back to lebanon to sikh american girl

you don't belong in this country,subway train,Sikh-American girl,Rajpreet Heir,New York,Middle East,go back to Lebanon,Donald Trump, hare crime

Rajpreet Heir a Sikh-American girl was taking the subway train to a friend's birthday party in Manhattan this month when the white man began shouting at her,

మరో భారత సంతతి యువతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు

Posted: 03/25/2017 03:19 PM IST
White man shouts go back to lebanon to sikh american girl

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికై.. పగ్గాలు చేతబూనిన జనవరి 20 నాటి నుంచి భారతీయులపై వరుసగా విద్వేష దాడులు జరుగుతూనే వున్నాయి. భారత అమెరీకన్లపై జరుగుతున్న జాత్యాహంకార దాడుల నేపథ్యంలో అమెరికన్ దౌత్యాధికారులతో పాటు అమెరికాలోని భారత దౌత్యాధికారులు కూడా అక్కడి ప్రభుత్వంతో నిత్యం టచ్ లోనే వున్నారని భారత విదేశాంగ శాఖ అధికారులు ఎన్ని ప్రకటనలు గుప్పించానా.. అక్కడి వాస్తవిక పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయి.

తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ హత్యోదంతాన్ని మర్చిపోక ముందే హర్పీత్ సింగ్. ఆ తరువాత ఇలా ఒక్కటి రెండు అంటూ వరుస క్రమంలో భారతీయులపై దాడులు జరుగుతూనే వున్నాయి. అయితే ఏ ఇతర దేశస్తులపై జరగని విధంగా కేవలం భారతీయులను మాత్రమే శ్వేతజాతీయులు టార్గెట్ చేయడం కలకలం రేపుతుంది. భారతీయులు, భారత అమెరీకన్లు శ్వేతజాతీయుల కంటికి మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన వారిలా కనిపిస్తున్నారా..? అన్న ప్రశ్నలు మరోమారు తాజాగా ఉత్పన్నమయ్యాయి.

శ్రీనివాస్ ను హత్యచేసిన తరువాత సదరు నిందితుడు మరో బార్ కు వెళ్లి తాను ఇరాక్ దేశస్థుడిని హత్య చేశానని చెప్పాడం.. ఆ తరువాత జరిగిన పలు ఘటనల్లో కూడా ఇదే వాదన తెరపైకి రావడం కూడా ఇప్పుడు భారత అమెరీకన్లలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా భారత సంతతికి చెందిన సిక్కు అమెరికన్ యువతి రాజ్ ప్రీత్ హేర్ విషయంలోనూ అదే జరిగింది. నువ్వు అమెరికాకు చెందిన దానివి కాదు.. వెంటనే లెబెనాన్ వెళ్లిపో అంటూ ఓ శ్వేత జాతీయుడు జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన స్నేహితురాలి జన్మదినాన్ని పురస్కరించుకుని సబ్ వే రైలులో వెళ్తున్న రాజ్ ప్రీత్ కౌర్ ను రైలులోనే ఓ అమెరికన్ యువకుడు వచ్చి ‘‘నువ్వు ఈ దేశానికి చెందిన దానికి కాదు.. వెంటనే లెబెనాన్ వెళ్లిపో’’ అంటూ అరిచాడు. తాను మధ్యప్రాశ్చా దేశీయురాలని కాదని, భారతీయురాలనని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బిగ్గరగా అరుస్తూ.. కేకలు వేసి భారతీయురాలని అందరిలో దోషిగా నిలబెట్టాడు. మ్యాన్ హట్టన్ లో ఈ ఘటన ఈ నెల రెండో వారంలో జరుగగా, బాధితురాలు తన అవేదనను అక్కడి న్యూయార్క్ టైమ్స్ కు తెలపడంతో సదరు పత్రిక ప్రచురించడంతో వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles