న్యూజెర్సీ తల్లి-కొడుకుల హత్య కేసులో ట్విస్ట్.. ఎవరు చంపారసలు? | Narra Hanumantha Rao condemned allegations.

New twist in andhra woman and son murder case in us

Narra Hanumanth Rao, Andhra Woman and Son Muder, Indian Woman And Son Murder, Narra Hanumantha Rao Arrest, Indian Techie Wife Murder, US Hate Crime, Sasikala Anish Sai Murder

Techie, son found dead in New Jersey home. Narra Hanumantha Rao responded in Wife and Son Murder case. Family suspects son-in-law in woman-son murder case in NJ, police investigates, says it's not hate crime.

అమెరికా హత్య కేసులో కొత్త ట్విస్ట్

Posted: 03/25/2017 03:29 PM IST
New twist in andhra woman and son murder case in us

న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, హనీష్ సాయి కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. భర్త నర్రా హనుమంత రావే వాళ్లిద్దరినీ హత్య చేసి కట్టుకథలు అల్లుతున్నాడని, ఇంట్లోకి వచ్చి మరీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని శశికళ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తమ అల్లుడికి అమెరికాలో మరో మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందని వారు వాదిస్తున్నారు.

కేరళకు చెందిన ఓ యువతితో హనుమంత రావుకి సంబంధం ఉందని, ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయని వారంటున్నారు. భర్త పెట్టే టార్చర్ గురించి శశికళ ఫోన్ లో సమాచారం ఎప్పటికప్పుడు అందించేందని కూడా వారు వివరించారు. అప్పుడే అప్రమత్తం అయ్యి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని, కుమార్తెను, మనుమ డిని కోల్పోవాల్సి వచ్చేది కాదని విలపిస్తున్నారు.

కాగా, జాతి విద్వేష కోణంలోనే ఇది జరిగిందన్న కోణాన్ని కూడా కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు కూడా. ఇక అత్త, మామలు తనపై చేస్తున్న ఆరోపణలపై శశికళ భర్త నర్రా హనుమంతరావు స్పందించారు. శశికళ తల్లిదండ్రులు బాధలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన భార్య శశికళ కుమారుడు హనీశ్ సాయిని తాను హత్య చేయలేదని నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయని హనుమంతరావు చెప్పారు.

కాగా ఆయన మరో చిత్రమైన వాదన వినిపించారు. భార్య-కుమారుడి మృతదేహాలు స్వగ్రామానికి వస్తాయని చెప్పిన నర్రా హనుమంత రావు తాను వచ్చేది లేనిది ఇంకా నిర్ణయిం తీసుకోలేదని చెప్పడం గమనార్హం. కాగా 2004 డిసెంబరు 30న నర్రా హనుమంతరావుకు శశికళకు వివాహం జరిగింది. 2006లో నర్రా హనుమంతరావు న్యూజెర్సీ వెళ్ళాడు. సీటీఎస్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్నశశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. శశికళ బుధవారం సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Jersey  Indian Woman and Son  Murder Case  

Other Articles