జర్నీ చిత్రాన్ని తలపించేలా వోల్వో బస్సుల ఢీ.. volvo busess accident in gadwal district

Volvo busess accident in gadwal district

bus accidents, volvo bus, gadwal district, four volvo busess, no major casualities, jogulamba district, hyderabad, crime

Four volvo busses met with an accident in cinema style as all are travelling towards hyderabad, but no major casualities noticed.

జర్నీ చిత్రాన్ని తలపించేలా వోల్వో బస్సుల ఢీ..

Posted: 03/25/2017 12:03 PM IST
Volvo busess accident in gadwal district

అతి వేగం ప్రమాదకారమం అని అన్ని హైవేలలో రాసివున్నా.. అతి తమ కోసం కాదనుకుంటారు వేగంగా వేళ్లే వాహనదారులు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ట్రావెల్స్ బస్సులు నడిపే డ్రైవర్లు తమకిలాంటివి కొత్త కాదకుంటారు. కానీ ప్రమాదం బారిన పడితే తప్ప అవి చూడాల్సింది.. పాటించాల్సిందేనని అనిపించడం కామన్. మరీ ముఖ్యంగా వోల్పో బస్సు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో కూడా ఇలాంటి అప్రమత్తచర్యలు తీసుకోకుండా బస్సులను వేగంగా నడిపడం ప్రయాణికుల పాలిట శాఫంగా మారుతుంది.

జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వరుస క్రమంలో వేగంగా వెళ్తున్న బస్సలు సినిమా పక్కీలో ఒకదాని మరోకరి ఢీకొన్నాయి. అయితే ప్రమాదం జరిగే క్రమంలో కళ్లు తెరచిన డ్రైవర్లు ఎంతగా బ్రేకులు నొక్కినా ప్రమాదాన్ని తప్పించలేకపోయారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో హైవేపై..  పొగాకు కంపెనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుకు బస్సుకు కనీసం యాబై మీటర్ల దూరం పాటించాలన్న నిబంధన వున్నా వేగమే మిన్నా అంటూ వెళ్లడంలో ఈ ప్రమాధం సంభవించింది.

ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికుల స్వల్పగాయాల పాలయ్యారు.  లారీని ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన మొదటి వోల్వో బస్సు.. ముందు వెళ్తున్న మరో వాహనాన్ని చూసి సడన్ బ్రేక్ వేశాడు.  దీంతో ఈ బస్సు వెనకే వస్తున్న మరో బస్సు వేగాన్ని నియంత్రించలేక మొదటి బస్పును ఢీకొనింది. సరిగ్గా ఇదే క్రమంలో వెనకగా వస్తున్న మరో రెండు బస్సులు డీకొన్నాయి. ప్రయాణికులెవరరీ పెద్దగాయాలు కాకపోవటం, ప్రాణనష్టం లేకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles