ఫ్రీ నీమ్ బీర్ కావాలా నయానా.. అక్కడికి వెళ్లాల్సిందే.. Neem tree at DU's North Campus churns out liquor

Du north campus neem tree will keep you in high spirits

delhi university, delhi university neem beer, neem beer du, neem tree du north campus, neem tree beer du north campus, north campus neem beer, trending, trending news, bizarre, delhi news

There’s a neem tree in DU’s North Campus, that produces a white liquid from its sap, and it’s popular as ‘neem beer’ for obvious reasons!

విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ‘‘లచ్ఛిందేవి’’ మందు పార్టీ..

Posted: 03/24/2017 12:21 PM IST
Du north campus neem tree will keep you in high spirits

అది విశ్వవిద్యాలయం.. నిత్యం విద్యార్థులు చదువుకునే సరస్వతి క్షేత్రం. అందులోనూ దేశరాజధానిలో వుంది. మొన్నామధ్య పలు అంశాలతో వార్తల్లో నిలిచింది. విద్యార్ధి సంఘాల మధ్య విభేదాలు.. ముగ్గురు విద్యార్థులపై రాజద్రోహం కేసులు, ఆ తరువాత విద్యార్ధి సంఘం నేత కన్హయ్య కుమార్ సమావేశాల నేపథ్యంలో వార్తల్లో నిలవడంతో పాటు పతకా శీర్షికలలోనూ స్థానాన్ని సంపాదించింది. అ విశ్వవిద్యాలయం ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శటి అని అర్థమైంది కదూ.

ఈ విశ్వవిద్యాలయంలో వున్న వేమ చెట్లను అక్కడి విద్యార్ధులు లక్షీదేవిగా పరిగనించి పూజలు కూడా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా తమ ప్రేమతో పాటు చదువులు కూడా విజయపథాన నడవాలని వాటెంటైన్స్ డే రోజున ప్రార్థనలు కూడా జరుపుతారు. అయితే వీరి ప్రార్థనలతో పాటు మందుబాబుల ప్రార్థనలను కూడా అలకించిందో ఏమో తెలియదు కానీ ఏకంగా ఉత్తర క్యాంపస్ లోని ఓ వేప చెట్టలు మాత్రం వారి మొరను అలకించింది. ఇప్పుడు అదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

యూనివ‌ర్శిటీతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడీ నార్త్ క్యాంప‌స్‌ వేప‌చెట్టు విద్యార్ధులకు ఇచ్చే మందుపార్టీ ట్రెండింగ్ గా మారింది. ఈ ఒక్క వేప‌చెట్టునుంచే రోజుకు తాటి కల్లును పోలిఉండే ఒక ద్రవం అదేనండీ వేమ కల్లు నిత్యం చెట్టు కణం నుంచి కారుతుంది. అంతేకాదు ఈ వేప కల్లు కూడా కొంత కిక్కును కూడా ఇస్తుంది. దీంతో విద్యార్థులు క్యాంప‌స్‌లో ప‌నిచేసేవారు ఈ చెట్టు వద్ద బారులు తీరుతూ కల్లును బాటిళ్ల నిండా పట్టుకుంటున్నారు. బీర్లలో వుండే కిక్కు కన్నా ఈ వేప క‌ల్లులో వుండే మత్తుమజా బ్రహ్మాండమంటున్నారు మందుబాబులు. దీనికి తోడు ఫ్రీగా వస్తున్న కల్లు ముందు డబ్బులు పెట్టి కొనే బీర్ ఎందుకు అని కూడా విద్యార్థులు కల్లు కోసం పోటీ పడుతున్నారు.

ఇక మరికొందరు వేప‌ క‌ల్లుకు ఔషదగుణాలున్నాయని ప్రచారం చేస్తుండటంతోనూ ఈ కల్లుకు గిరాకీ పెరిగింది. వేప కల్లు తాగితే శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని తోటమాలి మ‌హేష్ చెబుతున్నాడు. అప్పుడే తాటిచెట్టు నుంచి తీసిన క‌ల్లు ఏ ర‌కంగా అయితే వాస‌న వ‌స్తుందో వేప క‌ల్లు కూడా అదే విధ‌మైన తాజా వాస‌న వస్తుందని, దీనిని సేవించినా మ‌త్తు వ‌స్తుంద‌ని చెప్పాడు. ఈ చెట్టు నుంచి రోజుకు 10 లీట‌ర్ల క‌ల్లు కారుతుంద‌ని చెప్పాడు. క్యాంప‌స్ ఏ వేప చెట్టుకు రాని విధంగా నార్త్ క్యాంప‌స్‌లో ఉన్న ఈ వేప‌చెట్టు నుంచే క‌ల్లు కారుతోంద‌ని, దీంతో దీనికే విద్యార్థుల తాకిడి కూడా పెరిగిందని అంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neem Beer  Alcohol  neem tree toddy  North Campus  Free Beer  Delhi University  Tree sap  Free neem beer  

Other Articles