అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. అటకెక్కిన ఓటుకునోటు అంశం note for vote agri gold issue sinks amidst choas in ap assembly

Note for vote agri gold issues sinks amidst choas in andhra pradesh assembly

agrigold issue, choas in ap assembly, note for vote sinks in ap assembly, note for vote, ruckus between treasury bench and opposition, challenges thrown to divert agrigold issue, ap assembly, agri gold, andhra pradesh, assembly, chandrababu, ys jagan, chevireddy bhaskar reddy, chintamaneni prabhakar, politics

ruckus between treasury bench and opposition sinks agri gold issue in andhra pradesh assembly

అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. అటకెక్కిన ఓటుకునోటు అంశం

Posted: 03/24/2017 10:53 AM IST
Note for vote agri gold issues sinks amidst choas in andhra pradesh assembly

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో నవ్యాంధ్ర అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, దూషణల పర్వాలు చోటుచేసుకున్నాయి. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య అమర్యాద పిలుపు, నువ్వెంత.. అంటే నువ్వెంత.. అనే స్థాయికి వెళ్లాయి. బయటికి రండీ చూసుకుందాం అనే వరకు వెళ్లాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మాణాలపై చర్చను అడ్డుకునేందుకు ధీటుగా వ్యూహప్రతివ్యూహాలను ముందుగానే రచించుకున్న అధికార పక్షం ఇవాళ సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్ అంశాన్ని మళ్లీ ప్రస్తావిచింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అధినేత జగన్‌‌కు సవాల్ విసిరి.. లేదంటే మీరు రాజీనామా చేస్తార అన్న సవాల్ ను విసిరారు. ఈ అంశంపై ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా, ముందు చాలెంజ్ కు స్వీకరిస్తారా..? లేదా.? ఈ విషయాన్ని చెప్పండీ అంటూ అధికార సభ్యులు అరవడం.. ఇక సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదని ప్రతిపక్ష సభ్యులు అరోపిస్తున్నారు.

సభ ప్రారంభం కాగానే ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చించాలని వైసీపీ డిమాండ్ చేయగా, ప్రశ్నోత్తరాల తరువాత చర్చిద్దామని స్పీకర్ కోడెల అన్నారు. ముందుగా అ అంశంపై చర్చించాలని పట్టుబట్టిన వైసీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచ్చచేయడానికే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ఈ క్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రతిపక్ష నేత పట్ల అమర్యాదగా వ్యవహరించారు. తోటి సభ్యుల పట్ల గౌరవ ప్రదంగా వ్యవహరించాల్సిన అధికార సభ్యులు అమర్యాదగా, ఏకవచనంతో సంభోధించడం.. చాల్లే మాట్లాడింది అంటూ అనుచితంగా అడ్డుకున్నారు. అధికార సభ్యుడు బోండా ఉమ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష సభ్యులు అరోపిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చను అడ్డుకునేందుకే వారి ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తానికి సభలో ఇవాళ అమర్యాద, అగౌరవ ఘటనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు కేంద్రంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles