శవపేటికపై ఊరేగుతూ మరీ... చెన్నైలో విచిత్రం | RK Nagar HMK candidate variety nomination.

Hindu makkal katchi candidate on coffin

Hindu Makkal Katchi, Chennai Leader Coffin, Coffin RK Nagar, RK Nagar By-election, RK Nagar Nomination, Dinakaran wear Hat, RK Nagar Election candidates, Leader on Coffin

Hindu Makkal Katchi Candidate Ravi Kumar on Coffin. Dinakaran wear Hat for filing nomination.

శవపేటికపై ఊరేగుతూ మరీ భయపెట్టాడు

Posted: 03/24/2017 08:46 AM IST
Hindu makkal katchi candidate on coffin

ప్రజల దృష్టిలో పడి పాపులర్ అయిపోవాలంటే కాస్త డిఫరెంట్ గా ఆలోచించి స్టేట్ మెంట్లు ఇవ్వాలని జలీల్ ఖాన్ లాంటి నేతలు పిలుపు నిచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలవటం చూశాం కదా. కేవలం మాటలతోనే కాదు, చేష్టలతో కూడా సింపథీ కొట్టేయాలని యత్నించేవారు లేకపోలేరు. చెన్నైలో లీడర్ సరిగ్గా ఇలాంటి ఆలోచన చేసి వార్తల్లో నిలిచాడు. శవ పేటికపై ఊరేగుతూ వచ్చి తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం సందర్భంగా నిన్న ఈ సీన్ దర్శనమిచచింది.

హిందూ మక్కల్ కట్చి పార్టీకి చెందిన రవికుమార్ అనే అభ్యర్థి ఇలా వినూత్న ఆలోచన చేశాడు. శవ పేటికపై ఊరేగుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి తన నామినేషన్ సమర్పించాడు. శవ పేటికపై పడుకున్న ఆయన్ని, మెడలో మద్యం బాటిళ్లు ధరించిన పార్టీ కార్యకర్తలు ఈడ్చుకువెళ్లారు. అయితే ఏం జరుగుతుందో తెలీని జనాలు తొలుత కంగారు పడిపోయినా తర్వాత అసలు విషయం తెలియటంతో గోళ్లు మన్నారు.

Hindu Makkal katchi Ravi Kumar

తమిళనాడులో ఒక పక్క మంచి నీరు దొరకక అల్లాడుతుంటే, మద్యం మాత్రం ఏరులై పారుతోందని నామినేషన్ అనంతరం రవికుమార్ చెప్పాడు. ప్రభుత్వ తీరుపై తమ నిరసన వ్యక్తం చేస్తూ ఇలా శవ పేటికలో పడుకుని నామినేషన్ దాఖలు చేశానని తెలిపాడు. ఇక శశికళ వర్గం తరపున ఆమె మేనల్లుడు టీవీవీ దినకరన్ అన్నాడీఎంకే అమ్మ పేరుతో ప్రచారానికి సిద్ధమౌతుండగా, ఈసీ టోపీ గుర్తు కేటాయించటంతో అది ధరించి నామినేషన్ దాఖలు చేశాడు. మరోవైపు అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పేరుతో సెల్వం గ్రూప్ తరపున ఈ మధుసూధన్ ను బరిలోకి దింపటంతో ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. వారికి స్థంభం గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindu Makkal Katchi  Ravi Kumar  RK Nagar  By-Poll  

Other Articles