2 వేల రూపాయల నోటుపై అరుణ్ జైట్లీ క్లారిటీ.. Arun Jaitley gives clarity on new Rs 2000 note

Arun jaitley gives clarity on new rs 2000 note

new 2000 note, demonetisation, Rs 2000 notes, Note ban, Lok Sabha, Arun Jaitley, RBI, Shaktikanta Das, finance ministry, pm modi, finance

Finance Minister Arun Jaitley said there is no proposal to withdraw the Rs 2,000 notes that were introduced post demonetisation

2 వేల రూపాయల నోటుపై అరుణ్ జైట్లీ క్లారిటీ..

Posted: 03/17/2017 05:09 PM IST
Arun jaitley gives clarity on new rs 2000 note

పాత పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతం చేయడంతో పాటు నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడం, ఉద్రవాద కార్యకలాపాలకు వాటిని వినియోగించకుండా అడ్డుకోవడం, నల్లధనాన్ని వెలికితీసే చర్యలు చేపట్టిన కేంద్రం.. పెద్ద నోట్ల చెలమాణితోనే ఇవన్నీ సాధ్యమని చెప్పింది. అంతేకాదు.. ఇలా నోట్ల రద్దు చేయడం .. వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ప్రభుత్వం తీసుకున్న చర్యలని కూడా ప్రధాని నరేంద్రమోడీ నోట్ల రద్దు నేపథ్యంలో గత ఏడాది నవంబర్ ఎనమిదిన ప్రకటించారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వ అమోదంతో చెలామణిలోకి వచ్చిన కొత్త రెండు వేల రూపాయల నోటును కూడా త్వరలోనే రద్దు చేస్తామన్న వార్తల నేపథ్యంలో దానిపై అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ క్లారిటీ ఇచ్చారు. రెడు వేల రూపాయల నోటును కూడా రద్దు చేస్తారని వాటని దాచుకుని మరోమారు ఇబ్బందుల్లో పడకూడదని అర్ఎస్ఎస్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు రెండు వేల రూపాయలపై క్లారీటి కావాలని లోక్ సభ సభ్యులు కోరిన నేపథ్యంలో దానిపై లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు కేంద్ర అర్థిక మంత్రి.

కొత్తగా తీసుకొచ్చిన 2 వేల రూపాయల నోటును రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 10 నాటికి పాత రూ. 500, రూ. 1000 నోటలు మొత్తం 12.44లక్షల కోట్లు ఆర్బీఐ బ్యాంకుకు చేరాయన్నారు. వచ్చిన పాత నోట్లలో చిరిగిన వాటితోపాటు మాన్యువల్ కౌంటింగ్ లో లోపాల కారణంగా పూర్తి డేటా ఇంకా రావాల్సి ఉందన్నారు. దీనిపై మరోసారి రివ్యూ చేశాక పూర్తి సమాచారం అందిస్తామన్నారు. ఇక ఈ ఏడాది మార్చి 3 నాటికి 12 లక్షల కోట్ల కొత్త కరెన్సీ బ్యాంకుల నుంచి ప్రజలకు చేరిందన్నారు. జనవరిలో ఈ లెక్క 9.21 లక్షల కోట్లుగా ఉండిందని అరుణ్ జైట్లీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles