రోజా ‘ఆంటీ’ పై క్లారిటీ... 62 పేజీల రిపోర్ట్ తో కొత్త టెన్షన్ | Bonda Uma explain why he calls Roja as Aunty.

The privilege committee of ap assembly submit report

AP Assembly, Privilege Committee, MLA Roja Suspension, Speaker Kodela MLA Roja, Roja Letter to Kodela, Bonda Uma Aunty Comments, Uma Roja Comments, MLA Roja Aunty, Roja Anitha Controversy, Roja Suspension Extend, MLA Roja Sorry, MLA Roja Apology, Roja 62 Pages Report, Assembly Privilege Committee Roja

Privilege Committee Submits Report to AP Assembly Speaker Kodela Siva Prasad Rao over Roja Suspension.

ఎమ్మెల్యే రోజా.. మళ్లీ సస్పెండ్ చేస్తారా?

Posted: 03/16/2017 10:47 AM IST
The privilege committee of ap assembly submit report

రెండేళ్ల క్రితం ఏపీ అసెంబ్లీ సాక్షిగా పెద్ద ఎత్తున్న దూషణల పర్వమే జరిగింది. ఇందులో భాగంగా టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వైసీపీ సభ్యులను ఉద్దేశించి కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. ప్రతిపక్ష నేత జగన్ 420 అని, కొడాలి నాని మరియు ఫైర్ బ్రాండ్ రోజాను ఐరెన్ లెగ్ లుగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా రోజా ఆంటీ సభలో తీవ్ర గందరగోళం రేపుతుందంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై రోజా బొండా ఏమైనా కుర్రాడు అనుకుంటున్నాడా? అంటూ అదే స్థాయిలో కౌంటర్ వేసిందనుకోండి.

అయితే తాను గతంలో రోజాపై చేసిన వ్యాఖ్యలపై ఉమ ఇప్పుడు వివరణ ఇచ్చుకున్నాడు. గురువారం ఉదయం అసెంబ్లీకి వెళుతున్న సమయంలో బొండాను ఈ విషయంపై మీడియా ప్రతినిధులు క్లారిటీ అడిగారు. "మేమేం బూతులు మాట్లాడలేదు. ఆంటీ అనే పదం చాలా గౌరవప్రదమైందని, ఆ అనే పదం రోజాకు పూర్తిగా సరిపోతుందని తెలిపాడు. అయినా నేను ఆంటీ అంటే... నన్ను తిరిగి ఏమైనా అనమనండి, కానీ, మధ్యలో తమ సహచరురాలు అనితను దూషించడం ఏమిటి? ఓ దళిత ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు రోజా దూషించడం సరికాదు" అని ఉమా వివరణ ఇచ్చాడు.

ఇక రోజా సస్పెన్షన్ ప్రస్తావిస్తూ శాసనసభలో రోజాకు ప్రత్యేకమైన చట్టాలు ఏమీ ఉండవని... చట్టం అందరికీ సమానంగానే ఉంటుందని తెలిపాడు. ప్రివిలేజ్ కమిటీ ఎవరి మాటలూ వినదని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గతంలో క్షమాపణలు చెబుతానన్న రోజా ఆ పని చేయలేదని, అందుకే ప్రివిలేజ్ కమిటీ యాక్షన్ తీసుకుంటుందని తెలిపాడు.

మరో ఏడాది సస్పెన్షన్...

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల సంఘం నివేదికను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 62 పేజీలతో కూడిన నివేదికను ప్రివిలేజ్ కమిటీ సభకు సమర్పించింది. విచారణకు సంబంధించిన అన్ని విషయాలను ఈ నివేదికలో కమిటీ పొందుపరిచింది. రోజాపై ఇప్పటికే ఉన్న సస్పెన్షన్ ను మరో ఏడాది పాటు పొడిగించాలంటూ కమిటీ సిఫార్సు చేసింది. బేషరతుగా క్షమాపణ చెబుతానన్న రోజా... క్షమాపణ చెప్పలేదని నివేదికలో కమిటీ తెలిపింది. విచారణ సందర్భంగా వివిధ సందర్భల్లో భిన్నమైన వాదనలను రోజా వినిపించారని చెప్పింది. అయితే, రోజా సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సభకే వదిలేసింది కమిటీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Roja  Suspension  Assembly Speaker  Privilege Committee Report  

Other Articles