అసెంబ్లీలో అడుగుపెట్టినా.. సినిమా ఇంకా అయిపోలేదా? | Roja Enters Assembly Still Facing Threat.

Suspense continuous on roja suspension

Roja Suspension, Roja Suspension Extend, Roja Enters Assembly, MLA Roja Threat, Kodela Roja Suspension, YSRCP Green Ink Sign, AP New Assembly Roja, Roja Budget Session, Andhra Pradesh Budget Session

YSRCP MLA Roja hoping to attend Assembly session. But, TDP MLA Anitha responded to YSR Congress Party MLA Roja's suspension being extended to another year.

రోజా సస్పెన్షన్ సస్పెన్స్ కంటిన్యూ...

Posted: 03/07/2017 08:50 AM IST
Suspense continuous on roja suspension

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో కొత్త గుబులు మొదలయ్యింది. అందుకు కారణం అసెంబ్లీలో రోజా, ఇతర ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు చేయటమే. ఈ విషయంలో అధికారపక్షం వ్యూహం ఏంటో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు వేటు వేస్తారా? మరో ఐదుగురు శాసనసభ్యులపై ఎటువంటి నిర్ణయం తీసుకోబుతున్నారు? వారిపైనా కూడా వేటేస్తారా? వంటి ప్రశ్నలు వారిని నేతలను కుదురుగా ఉండనీయడం లేదు.

అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన దానిని సభా హక్కుల సంఘానికి పంపారు. ఇందుకు సంబంధించిన నివేదికను సభాసంఘం సిద్ధం చేసింది. రోజా అంశం కనుక అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తే ఆమెను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అలాగే వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజా, రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, శ్రీనివాసులు తదితరులను కూడా సభాహక్కుల కమిటీ విచారించింది. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను స్పీకర్‌కు అందించింది. నేటి సభలో ఆ నివేదికలపై ప్రస్తావన ఉంటుందేమోనన్న గుబులు ఇప్పుడు వైసీపీలో మొదలైంది. అయితే ఏడాది తర్వాత నిన్న కొత్త అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా సస్పెన్షన్ పొడగిస్తే నా తడాఖా చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రోజా సభకు వచ్చి తెలుగుదేశం ఎమ్మెల్యే అనితకు క్షమాపణలు చెప్పాల్సి వుంటుందని, ఎటువంటి షరతులు లేకుండా ఆమె క్షమాపణలు చెప్పాలని మంత్రి యనమల తెలిపాడు. ప్రస్తుతం ఆమెపై అనిత చేసిన ఫిర్యాదుపై సభా హక్కుల కమిటీ నివేదిక రూపొందించిందిదని అని అంటున్నారు. రోజా బేషరతు క్షమాపణ చెప్పిన పక్షంలో, ఆమెపై తుది నిర్ణయం తీసుకునే హక్కును సభాపతికి వదిలివేయనున్నట్టు యనమల స్పష్టం చేశాడు.


గ్రీన్ ఇంకుతో కాసేపు...

వైసీపీలో గ్రీన్ ఇంకు కలకలం రేపింది. విషయం ఏంటంటే... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ తరపున గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల నాని సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులను ప్రతిపాదిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ ఇంకును ఉపయోగించి సంతకం చేశారు. దీంతో గ్రీన్ ఇంకుతో సంతకం చేసిన తమ నామినేషన్లు చెల్లుతాయో?లేదో?నని కొద్దిసేపు టెన్షన్ ఎక్కువైంది. అయితే చివరికి ఎన్నికల అధికారులు ఆ నామినేషన్లు చెల్లుతాయని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  MLA Roja  Suspension  Assembly Session  

Other Articles