తస్మాత్ జాగ్రత్తా.. రూ. 2000 నోటు రంగు వెలసిపోతుంది..! UP Police into a tizzy after man gets a faded Rs 2,000 currency note

Up police into a tizzy after man gets a faded rs 2 000 currency note

Rs 2000, currency, uttar pradesh, sbi, atm, fake, police, investigation, demonetisation, finance ministry, Reserve bank of India

The Uttar Pradesh police was thrown into a tizzy after a man claimed a new currency note of Rs 2,000 denomination, he withdrew form a SBI ATM, started to lose its pink colour.

తస్మాత్ జాగ్రత్తా.. రూ. 2000 నోటు రంగు వెలసిపోతుంది..!

Posted: 02/26/2017 08:36 AM IST
Up police into a tizzy after man gets a faded rs 2 000 currency note

 దేశం నుంచి అవినీతిని, నల్లధనాన్ని పారద్రోలడంలో భాగంగా పాత పెద్దనోట్లు రద్దు చేసిన తరువాత కేంద్రం తక్షణం దేశప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన రూ. 2000 పెద్ద నోట్లు నకిలీవి రావడం, బోమ్మ నోట్లు కూడా ఏటీయం కేంద్రాల ద్వారా రావడం.. లాంటి ఘటనలు చవిచూసిన తరువాత తాజాగా ఈ పెద్ద నోటు రంగు కూడా వెలసిపోతుందట. అయితే రంగుపోతేనే అది అసలైన నోటు అని అర్బీఐ గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఎలాంటి నీరు పడకపోయినా రంగు వెలసిసోతుందని అందోళన చెందుతున్నారు ప్రజలు.

ఏటీఎంలో వచ్చిన రూ.2,000 నోటు రంగు పోతోందని ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. రితిక్‌ గుప్తా అనే వ్యక్తి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు తీయగా ఐదు రూ.2,000 నోట్లు వచ్చాయి. వాటిలో ఒక దాని రంగు పోతోందని రితిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది దొంగనోటు కాదనీ, రంగు పోతున్నట్లుగా ఫిర్యాదు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. ఏటీఎంలో దొంగనోట్లు వచ్చే అవకాశం లేదని బ్యాంక్‌ ప్రాంతీయ మేనేజర్‌ చెప్పారు. ఇటీవలే రిజర్వు బ్యాంకు బదులు చిల్ర్డన్  బ్యాంకు అని రాసి ఉన్న నాలుగు నోట్లు ఢిల్లీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో రావడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles