టాలీవుడ్ నిర్మాతపై క్రిమినల్ కేసు.. ఎందుకో తెలుసా..? tollywood producer kireeti paruchuri booked under criminal case

Police files criminal case against tollywood producer kireeti paruchuri

rash driving, paruchuri kireeti, banjarahills, Tollywood producer paruchuri prasad, ungarala rambabu, arrest of kireeti, kireeti rash driving, paruchuri kireeti, producer's son, tollywood

Hyderabad police had arrested a Tollywood producer paruchuri prasad’s son, kireeti who too is an producer, for indulging in rash driving and terrorizing people. He was arrested for creating fear among pedestrians and locals.

టాలీవుడ్ నిర్మాతపై క్రిమినల్ కేసు.. ఎందుకో తెలుసా..?

Posted: 02/24/2017 07:14 PM IST
Police files criminal case against tollywood producer kireeti paruchuri

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు, సినీ నిర్మాత అయిన కిరీటిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మితిమీరిన వేగంతో వాహనం నడపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయబ్రాంతులకు గురి చేసినందుకు గాను అయనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. హస్యనటుడి నుంచి హీరోగా మారిన సునీల్ రాబోతున్న ఉంగరాల రాంబాబు చిత్రానికి కూడా పరుచూరి కిరీటి(22 నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌ రోడ్‌ నంబర్‌-10లో నివసించే పరుచూరి కిరీటి బీటెక్‌ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.కొద్ది రోజుల నుంచి తన ఫార్చునర్‌ కారు( ఏపీ 09 సీవీ 2929)లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బందికరంగా కలిగిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంపై నాలుగు రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, సీసీ ఫుటేజీల ఆధారంగా కిరీటీ ర్యాష్‌ డ్రైవింగ్‌ ను గుర్తించారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ చౌరస్తాలో పోలీసులు నిఘా వేసి మితిమీరిన వేగంతో దూసుకొస్తున్న వాహనాన్ని ఆపి కిరీటిని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles